చంద్రబాబును చినజీయర్‌ స్వామి ఎందుకు పిలవలేదు..?

భారత దేశమంతా తిరిగి చూసేలా హైదరాబాద్ శివార్లలో 216 అడుగుల రామానుజుని విగ్రహం ఏర్పాటు చేశారు చినజీయర్ స్వామి.. దీన్ని సమతాకేంద్రం అని పిలుస్తున్నారు. ఈ ధామానికి ఎన్ని ప్రత్యేకతలో ఉన్నాయి.. మొత్తం 108 వైష్ణవాలయాల నమూనాలను ఇక్కడ రూపొందించారు.. అంతే కాదు.. 120 కిలోల స్వర్ణ రామానుజుని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు.. అయితే.. రెండు విగ్రహాలను ఒకదాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా.. రెండో దాన్ని రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా ప్రారంభించజేశారు. రామానుజుని సహస్రాబ్ది వేడుకలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు వచ్చారు.


తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ హాజరుకాకపోయినా మంత్రులు వచ్చారు. ఇక ప్రధాని, రాష్ట్రపతి వచ్చిన సంగతి తెలిసిందే. అమిత్‌ షా వంటి కీలక మంత్రులు కూడా వచ్చారు. ఏపీ  నుంచి సీఎం జగన్ కూడా వచ్చారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వచ్చి సమతాకేంద్రాన్ని సందర్శించారు. సినీ రంగం నుంచి కూడా  పలువురు ప్రముఖులు వచ్చి ఈ సమతాకేంద్రాని చూసి ఆశ్చర్యపోయారు.. చినజీయర్ స్వామి  కృషిని మెచ్చుకున్నారు. అయితే ఇందరు వచ్చినా.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం రాలేదు.


చంద్రబాబు రాకపోవడానికి కారణం ఏంటి.. అంటే.. ఆయన్ను పిలవకపోవడమే అంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. చినజీయర్ స్వామి కూడా అధికారంలో ఉన్నవారి ప్రాపకం కోసం తాపత్రయపడుతున్నారని.. అధికారంలో ఉన్న సీఎం, పీఎంలను పిలిచిన చినజీయర్ విపక్ష నేతలను విస్మరించారని అసహనం వ్యక్తం చేశారు తాను తన పత్రికలో రాసుకున్న ఓ వ్యాసంలో.


తాజాగా ఈ అంశంపై చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. అధికారంలో ఉన్న వారినే ఆహ్వానించారనడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకులను పిలవలేదన్న ప్రచారాన్ని చినజీయర్ స్వామి తోసిపుచ్చారు. తాము అందర్నీ పిలిచామన్నారు. కొందరు తమ ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా రాకపోయి ఉండవచ్చని వివరణ ఇచ్చారు. అధికారపక్షం, విపక్షం అనేది ప్రభుత్వానికి ఉంటుందే తప్ప తమకు కాదని చినజీయర్‌ స్వామి వివరణ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: