భారత్‌లో ధనికులు ఎక్కువుగా ఉండేది ఎక్కడో తెలుసా... షాక్ ఇస్తోన్న హైదరాబాద్..!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎక్కువ మంది ధనికులు ఉంటున్నారా ? ఇక సౌత్‌లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ధనికుల పరిస్థితి ఏంటన్నది కూడా ఆసక్తికరమే. తాజాగా నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్-2022 సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. దేశంలో అత్యథికంగా ధనికులు ఉన్న ప్రాంతం ముంబయి అని ఈ సర్వే స్పష్టం చేసింది. ఆ మాటకు వస్తే ముంబయి ఇప్పుడే కాదు... గత 20- 30 ఏళ్ల నుంచి కూడా దేశంలోనే ఎక్కువ మంది ధనికులు ఉన్న నగరంగా రికార్డులకు ఎక్కింది.
ఇక విచిత్రం ఏంటంటే ముంబయి తర్వాత దేశంలో అత్యథికంగా ధనికులు ఉన్న సిటీ మన తెలంగాణ రాజధాని హైదరాబాద్. దేశంలో ముంబయి తర్వాత అత్యధికంగా ధనికులు హైదరాబాద్ లోనే ఉంటున్నారన్న విషయాన్ని ఈ సర్వే స్పష్టం చేసింది. దేశంలోనే ఎక్కువ మంది ధనికులు ఉండే ర్యాంకింగుల్లో బెంగళూరు, పూణె, ఇండోర్ లాంటి నగరాల్ని హైదరాబాద్ ఎప్పుడో దాటేసిందనేది నివేదిక చెప్పింది.
నికర ఆస్తి విలువ 227 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉన్న వారి లిస్టు ప్రకారం చూస్తే వీరిలో 1596 మంది ముంబయిలో ఉండగా, 467 మంది హైదరాబాద్ లో ఉంటున్నట్టు తేలింది. ఇక హైదరాబాద్‌లో మరో నాలుగు సంవత్సరాలలో 2026 నాటికి అది ధనికుల సంఖ్య 728 కు చేరుకుంటుంది. వచ్చే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా ధనికుల సంఖ్య 19వేలు దాటుతుందని కూడా సర్వే స్పష్టం చేసింది. ఇక మన దేశంలో ఉన్న ధనికుల్లో ఎక్కువ మంది.. ఇంకా చెప్పాలంటే 60 శాతం మంది కేవలం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారట.