పవన్ కలిస్తే..ఆ మూడు జిల్లాల్లో సైకిల్ సవారీనే..!
అదే సమయంలో టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది...విడివిడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా చర్చలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారంపై రకరకాలుగా టాక్ నడుస్తోంది..రెండు పార్టీల పొత్తు ఉండొచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. అలాగే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే వైసీపీకి చెక్ పెట్టగలవని విశ్లేషణలు కూడా వస్తున్నాయి.
టీడీపీ-జనసేనలు మాత్రం కలిస్తే వైసీపీకి డ్యామేజ్ జరగడం ఖాయమని చెప్పొచ్చు...అలాగే రెండు పార్టీల ప్రభావం కొన్ని జిల్లాలపై ఎక్కువ ఉంటుందని అంటున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ-జనసేనల పొత్తు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, రెండు పార్టీల పొత్తు పెట్టుకుంటే ఈ మూడు జిల్లాల్లో వైసీపీ అడ్రెస్ గల్లంతు అవుతుందని చెబుతున్నారు. ఊహించని విధంగా మూడు జిల్లాల్లో టీడీపీ మెజారిటీ సీట్లు దక్కించుకోవచ్చని, అలాగే పొత్తులో భాగంగా జనసేన సైతం కొన్ని సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
కృష్ణాలో 16 సీట్లు ఉండగా, టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుంటే...12 సీట్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక వెస్ట్ గోదావరిలో 15 సీట్లు ఉండగా...అక్కడ కూడా 12 సీట్లు వరకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తూర్పులో 19 సీట్లు ఉండగా..ఇక్కడ 13-15 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వస్తున్నాయి..మొత్తానికి మూడు జిల్లాల్లో టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం ఎక్కువ ఉండేలా ఉంది.
2014 ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో జనసేన పొత్తు / మద్దతు ఉండడంతోనే టీడీపీ ఎక్కువ సీట్లు గెలిచింది. ఆ ఎన్నికల్లో సీమ, నెల్లూరు జిల్లాల్లో పార్టీ దెబ్బతిన్నా కూడా ఇక్కడ వచ్చిన సీట్లతోనే అధికారంలోకి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం టీడీపీకి పెద్ద బొక్క పడిపోయింది. మరి ఈ సారి అయినా టీడీపీ జనసేన పొత్తు ఉంటుందా ? ఏం జరుగుతుంది ? అన్నది చూడాలి.