సూప‌ర్ ఫామ్‌లో చంద్ర‌బాబు.. ఇదేం ట్విస్టురా బాబు...!

VUYYURU SUBHASH
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంలో బాగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది...గతంలో మాదిరిగా మూస రాజకీయాలు చేయకుండా..ఇప్పుడు జనాలని ఆకర్షించేలా ముందుకెళుతున్నారు..అసలు బాబు పూర్తిగా ఫామ్‌లోకి వచ్చి వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. గతంలో బాబు ఎప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు..జనం ఓర్పుతో సంబంధం లేకుండా తాను అనుకున్నది మాట్లాడేసేవారు..అసలు తన మాటలు జనాలకు బోర్ కొడుతున్నాయా? లేదా? అనే కోణం ఆలోచించేవారు కాదు. చెప్పాలంటే బాబు జనాలని ఆకర్షించేలా మాట్లాడటం తక్కువ అని చెప్పొచ్చు.

కాకపోతే అడ్మినిస్ట్రేటర్‌గా బాబు పని గురించి అందరికీ తెలుసు కాబట్టి..ఆయన్ని ప్రజలు ఆదరిస్తూ వెళుతున్నారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించే నాయకుడు బాబు...కానీ ఒకోసారి మాటలు కూడా చాలా ముఖ్యమని చెప్పొచ్చు. ఉదాహరణకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ని తీసుకుంటే...ఆయన ఏ విధంగా ప్రజలని ఆకర్షించేలా మాట్లాడతారో తెలిసిందే..ఏదో పూర్తిగా ప్రజల్లో కలిసిపోయి, ప్రజల బాషలో మాట్లాడుతూ..ఆకట్టుకుంటారు..ఇంకా పని చేయడం తక్కువైన మాటలు ఎక్కువ చెబుతారు.

కానీ అలా చేయడం బాబుకు రాదనే చెప్పాలి..బాబు మాట్లాడితే...ఏదో కాలేజ్‌లో ప్రొఫెసర్ మాట్లాడినట్లే ఉంటుంది...అంటే చెప్పాలంటే బోర్ కొట్టేలా మాట్లాడతారు..జనాల్లో కలిసిపోయేలా మాట్లాడారు. అయితే ఇదంతా ఒకప్పుడు...ఇప్పుడు బాబులో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది..సభల్లో లెక్చర్లు ఇవ్వకుండా, ప్రజలతో మమేకమయ్యేలా మాట్లాడుతున్నారు. అలాగే ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇచ్చే విషయంలో కూడా బాబు బాగా మారిపోయారు. చెప్పాల్సిన విషయం చెబుతూనే...తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి..వివేకా హత్యకేసుపై స్పందిస్తూ...వివేకా కుమార్తె సునీత...చంద్రబాబు పావు మాదిరిగా మారిపోయారని ఆరోపించిన విషయం తెలిసిందే..దీనికి బాబు కౌంటర్ పూర్తిగా వెటకారంగా ఇచ్చారు.

వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐని ‘నేనే’ నడిపిస్తున్నానని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం చేస్తే వారి వెనుక ‘నేనే’ ఉన్నానని  సినిమా టికెట్ల విషయంలో గొడవ వస్తే దానివెనుకా ‘నేనే’ ఉన్నానని ఆరోపిస్తున్నారని, ఇవన్నీ ‘నేను’ చేయగలిగితే అసలు ఎందుకు ఓడిపోతాను? అని చెప్పి బాబు కౌంటర్ ఇచ్చారు. సునీతనే కాదు అవినాష్ రెడ్డి..ఆఖరికి జగన్ రెడ్డి కూడా నా మనషులే అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇలా బాబు పూర్తిగా వెటకారంలో కౌంటర్లు ఇచ్చారు...ఇక ఇలాగే బాబు కంటిన్యూ అయితే బాగుంటుందని తెలుగు తమ్ముళ్ళు కోరుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: