రష్యా యుద్ధం: ఆ 'రహస్యం' మరోసారి వెల్లడైందా?
గతంలో నానా జాతి సమతి అనే ఓ వ్యవస్థ వచ్చింది.. అది తన పాత్ర సరిగ్గా పోషించకపోవడం వల్లే రెండో ప్రపంచ యుద్దం వచ్చింది.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇలాంటి యుద్దాలు రాకూడదని ఐక్య రాజ్య సమితిని ఏర్పాటు చేసుకుంది ఈ ప్రపంచం.. కానీ.. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆ ఐక్య రాజ్య సమితి నిస్సహాయతను బయటపెట్టింది. ఈ ఐక్య రాజ్య సమితి మీద కొందరు అమాయకులకు చాలా భ్రమలు వున్నాయనిపిస్తోంది.
ఇంత యుద్ధం జరుగుతుంటే ఐక్య రాజ్య సమితి ఏదో చెయ్యవచ్చు కదా.. అని అంటున్నారు. కానీ.. ఐక్య రాజ్య సమితి అనే దానికి అంత సీన్ లేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే.. అది దోపిడీ కుల పెద్దల పంచాయితీ లాంటిది మాత్రమే అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఆ సమితిలో సమితి మొదట చేసే ఏ నిర్ణయాన్నయినా అమలు కాకుండా అడ్డుకునే హక్కు ఐదు పెద్ద దేశాలకు ఉంది. దీన్నే వీటో అధికారం అంటారు.
ఈ వీటో అధికారం వల్ల ఎలాంటి అడుగూ ముందుకు పడదు. అసలు ఆ ఐదు పెద్ద దేశాలతోనే తంటా అంతా ఉంటుంది. మళ్లీ వాటికే వీటో హక్కు ఉంటుంది. మొన్నటి రష్యా దాడిపై కూడా అమెరికా తీర్మానం పెడితే రష్యా ముందే వీటో చేసేసింది. ఇక శాంతి ఎలా సాధ్యం.. దీనికి తోడు ఐక్య రాజ్య సమితిలో జనాభా ఆధారంగా దేశాలకు అధికారాలు లేవు.. భారత్ వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి కూడా శాశ్వత సభ్యత్వం లేదు. సో.. ఈ యుద్ధం వల్ల ఐక్య రాజ్య సమితి డొల్లతనం మరోసారి ప్రపంచానికి వెల్లడైంది.