జగన్ పాలన: ఆ ఎల్లో మీడియా ప్రచారం అబద్దమేనా?
అయితే.. ఆ మీడియా సంస్థలు చెబుతున్నంత దారుణంగా ఏపీ పరిస్థితి లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో క్రమంగా రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుతోందని.. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో రూ.57,000 కోట్ల చొప్పునే రాబడి ఉందని.. 2021-22లో సవరించిన అంచనాల ప్రకారం రూ.73,690 కోట్ల రాబడి ఉందని.. పన్నేతర ఆదాయంలోనూ గణనీయ మార్పు వచ్చిందని.. ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతోనే ఈ పెరుగుదల సాధ్యమైందని.. తాజాగా విడుదలైన సామాజిక ఆర్థిక సర్వే వెల్లడిస్తోంది.
సామాజిక ఆర్థిక సర్వే రిపోర్టును అధ్యయనం చేస్తే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని అర్థం అవుతోంది. కరోనాతో ఏర్పడ్డ సంక్షోభం నుంచి ఏపీ క్రమంగా గట్టెక్కుతున్నట్టు సామాజిక ఆర్థిక సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం పెరగడం ఇందుకు సూచనగా భావించవచ్చు. 2019-20లో రాష్ట్ర ఆదాయం ఆశించిన స్థాయిలో రాలేదని.. 2020-21లో కోవిడ్ లాక్డౌన్, ఆంక్షలతో రాష్ట్ర సొంత ఆదాయం భారీగా పడిపోయినట్టు సామాజిక ఆర్థిక సర్వే చెబుతోంది. తాజాగా కోవిడ్ తగ్గుముఖం పట్టడం.. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వంటి కారణాలతో 2021-22లో సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత ఆదాయం రూ.73,690 కోట్లకు చేరుతుందట. సో.. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. మరీ కొన్ని మీడియా సంస్థలు చెప్పినట్టు భయంకరంగా ఏమీ లేదు.