బాబుతో పవన్..కమలాన్ని లైన్‌లో పెడతారా...?
కాకపోతే ఇక్కడో ఒక ట్విస్ట్ ఉంది...ప్రస్తుతం జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయి...అంటే టీడీపీతో ముందుకెళ్లాలంటే పవన్, బీజేపీని వదలాలి..ఎందుకంటే బీజేపీ, టీడీపీతో కలిసేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. అసలు చంద్రబాబుని కలిసే ప్రసక్తి లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు..అలాంటప్పుడు పవన్‌కు ఉన్న ఆప్షన్...టీడీపీతో కలిసి బీజేపీని వదిలిపెట్టడం లేదంటే...బీజేపీని ఎలాగోలా ఒప్పించి పొత్తుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేయడం..
కానీ ఈ ప్రక్రియ అంతా జరుగుతుందా? అంటే ఏమో చెప్పలేని పరిస్తితి..ప్రస్తుతానికైతే ఏపీ బీజేపీలో రెండు గ్రూపులు ఉన్నాయి...ఒక గ్రూపు టీడీపీకి సపోర్ట్ చేస్తుండగా, మరో గ్రూప్ వైసీపీకి సపోర్ట్ చేస్తుంది..దీంతో పొత్తు విషయం తేలుతుందో లేదో క్లారిటీ లేదు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ..జగన్‌తో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అసలు పొత్తు విషయం బీజేపీ అధిష్టానం చేతులో ఉన్న విషయం తెలిసిందే.
వారే ఇప్పుడు ఏపీలో పొత్తుల అంశాన్ని తేల్చాల్సి ఉంది..వారికి టీడీపీతో గాని పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే...ఆ పార్టీని పక్కన పెట్టాల్సిందే. అదే సమయంలో ఇటు టీడీపీ నేతలకు కూడా బీజేపీతో పొత్తుపై పెద్దగా ఆసక్తి లేదు..వారికి జనసేనతో పొత్తు ఓకే. అయితే జనసేన గాని టీడీపీతో కలిసి ముందుకెళ్లాలని అనుకుంటే ఖచ్చితంగా బీజేపీని వదలాల్సి వస్తుంది. అంటే పొత్తుల విషయంలో ఎన్ని ట్విస్ట్‌లు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరి చూడాలి చివరికి ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు..అసలు టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందో, అందులో బీజేపీ కలిసి ఉంటుందో లేదో చూడాలి.