జ‌న‌సేన ఇలా అయితేనే టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా... సైకిల్‌కు మామూలు బ్యాండ్ కాదుగా..!

VUYYURU SUBHASH
రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని గ‌ద్దె దింపాల‌ని.. ప్ర‌దాన ప్ర‌తిప‌క్షాలు ఒక్కుమ్మ‌డిగా ఒకే గొడుగు కింద‌కు చేరాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు మేదావులు స‌హా రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ క్ర‌మంలో ఎవ‌రు క‌లిసినా.. ఎవ‌రు క‌ల‌వ‌క‌పోయినా.. జ‌న‌సేన‌-టీడీపీలు మాత్రం క‌లిసి పోటీ చేయాల‌ని.. పార్టీలో ఒక టాక్ వినిపిస్తోంది. ఇటుజ‌న‌సేన నాయ‌కులు కానీ, అటు టీడీపీ నాయ‌కులు కానీ.. పెద్ద ఎత్తున ఇదే విష‌యంపై చ‌ర్చ చేస్తున్నారు. అయితే..ఈ క్ర‌మంలో జన‌సేన నుంచి మ‌రో వింత కోరిక ఒక‌టి వెలుగు చూసింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము సూచించిన స్థానాల‌ను త‌మ‌కు ఇచ్చేసి.. మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేయాల‌ని.. జ‌న‌సేన‌లోని కొంద‌రు సంకేతాలు పంపిస్తున్నారు. ఇది పెద్ద‌స్థాయిలోనే జ‌రుగుతున్న విష‌యం కావ‌డంతో మీడియాకు సైతం పొక్కింది. వాస్త‌వానికి జ‌న‌సేన‌కు ఉన్న బ‌లం చూసుకుంటే.. కాపులు ఎక్క‌డైతే ఎక్కువ‌గా ఉన్నారో.. అక్క‌డ జన‌సేన‌కు ఎక్కువ‌గా ఓట్లు ప‌డ్డాయి. గ‌త ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. జ‌న‌సేన ఎక్కువ‌గా బ‌లంగా పోటీ ఇచ్చిన చోట్ల కాపుల ఓట్ల‌ను బ‌లంగా చీరల్చింది.

అదే అప్ప‌ట్లోనే.. జ‌న‌సేన‌.. టీడీపీ క‌లిసిపోటీ చేసి ఉంటే.. వైసీపీకి 151 సీట్లు వ‌చ్చేవి కావ‌నే ఒక వాద‌న కూడా ఉంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో అమ‌లు చేయాల‌ని.. జ‌న‌సేన నేతలు చూచాయ‌గా చెబుతున్నారు. దీనిపై ఎవ‌రూ బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా.. మీడియా ప్ర‌తినిధుల వ‌ద్ద చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. అంటే.. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ రెండు జిల్లాల నుంచి మూడు జిల్లాల వ‌ర‌కు త‌మ‌కు వ‌దిలేయాల‌ని.. వారు చెబుతున్నారు.

ముఖ్యంగా కాపులు ఎక్కువ‌గా ఉన్న తూర్పు, విశాఖ‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌ను త‌మ‌కు వ‌దిలేసి.. మిగిలిన రాష్ట్రం మొత్తం టీడీపీ పోటీ చేయాల‌నేది వీరి సూచ‌న‌. అయితే.. ఇది సాధ్యం కాద‌నేది జ‌న‌సేన నేత‌లే చెబుతున్న‌మాట‌. ఎందుకంటే.. అన్ని జిల్లాల్లోనూ అంద‌రూ పోటీ చేయాల‌నేది.. టీడీపీ కాన్సెప్ట్‌. సో.. వీరి వాద‌న ఎలా ఉన్నా.. ఇది మాత్రం సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ రేపు ప‌వ‌న్ కూడా ఇదే ప‌ట్టుబ‌డితే.. ఏం చేయాల‌నేది టీడీపీలో చ‌ర్చ‌గా మారింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: