సోము వారి స‌మ‌ర్ప‌ణ‌.. సూప‌ర్ కామెడీ పాలిటిక్స్‌..!

VUYYURU SUBHASH
రాష్ట్రంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స‌హా.. ఆ పార్టీ నాయ‌కులు చేస్తున్న రాజ‌కీయాలపై మేధావులు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తు న్నారు. తాజాగా బీజేపీకి చెందిన రాజ్య‌స‌భ‌స‌భ్యులు సుజ‌నా చౌద‌రి, జీవీఎల్ న‌ర‌సింహారావు వంటివారు.. ఒక వాద‌న తెర‌మీద‌కి తీసుకువ‌చ్చారు. కేంద్రం లోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఇస్తున్న నిధుల కార‌ణంగానే రాష్ట్రం ముందుకు సాగుతోంద ని.. జ‌గ‌న్ కులాసాగా పాల‌న చేస్తున్నాడంటే.. మోడీ ద‌య‌వ‌ల్లే.. అంటూ వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఓకే.. ఇదే నిజ‌మ‌ని అనుకుం టే.. కేంద్రం ఇస్తున్న నిధులు.. పోల‌వ‌రం ప్రాజెక్టుకు స‌రిపోవ‌డం లేదు. అంతేకాదు.. అమ‌రావ‌తి నిర్మాణానికి ఇస్తామ‌ని.. నిధులు ఏమ య్యాయి? అనేది మేధావుల మాట‌. ఎందుకంటే.. నిజంగానే ఏపీపై కేంద్రానికి అంత ఉదార‌త ఉంటే.. ఆయా ప‌నులు ఎందుకు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నిజా నికి కేంద్రం ఇస్తున్న నిధుల్లో జీఎస్టీ వాటాను స‌మంగా పంచ‌డం లేద‌ని.. ఇటీవ‌ల ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌..రెడ్డి కేంద్రా న్ని కోరారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వ‌లేదు. ఇక‌, ఇటీవ‌ల ఇచ్చిన బ‌డ్జెట్‌లోనూ.. అమ‌రావ‌తికి కేటాయించిన నిధులు కేవ లం రూ.ల‌క్ష‌. ఇక‌, విశాఖ అభివృద్ది, వెనుక బ‌డిన జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నిధుల ఊసేలేదు. విశాఖ స్టీల్ ప్లాంటును సైతం అమ్మేస్తున్నారు. మ‌రి వీటికి సోము ఏం స‌మాధానం చెబుతారు? అనేది మేధావుల ప్ర‌శ్న‌. అన్ని రాస్ట్రాల‌కు ఇచ్చిన‌ట్టుగానే.. ఏపీకి కూడా నిధులు ఇస్తున్నారే త‌ప్ప‌.. ప్ర‌త్యేకంగా చేసిన ప్ర‌యోజ‌నాలు ఏమీలేవు. యూపీ ని తీసుకుంటే.. గ‌త ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. అక్క‌డ భారీ ఎత్తున నిధులు కుమ్మ‌రించింది వాస్త‌వం కాదా? అనేది మేధా వుల మాట‌.

మ‌రీముఖ్యంగా.. అప్పులు చేసుకునేందుకు ఏపీని ప్రోత్స‌హిస్తోంది ఎవ‌రు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇవ‌న్నీ స‌రే.. బీజేపీ నాయ‌కులు చెబుతున్న‌దంతా వాస్త‌వ‌మే అయితే.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లొచ్చుక‌దా? అనేది మ‌రో ప్ర‌శ్న‌. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. వారి మ‌ద్ద‌తు కూడా కూడ‌గ‌ట్ట‌వ‌చ్చు క‌దా.. అంటున్నారు. పైకి చెప్ప‌డానికి క్షేత్ర‌స్థాయిలో.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నించాలని అంటున్నారు. కాబ‌ట్టి.. సోము వీర్రాజు చేస్తున్న పాలిటిక్స్ కేవ‌లం ప్ర‌చారానికే త‌ప్ప‌.. ప్ర‌యోజ‌న‌కరంగా లేవ‌ని చెబుతున్నారు. మ‌రి ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: