చంద్రబాబు అప్పుడే ఈ పని చేసుంటే బావుండేదిగా?

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అయ్యింది. వైసీపీ నాయకులు పలు జిల్లాల్లో ప్రారంభోత్సవాలు చేశారు. వైసీపీ నాయకులు దీన్నొక పండుగగా చేసుకుంటున్నారు. జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చుకున్నారని వైసీపీ నాయకులు ఘనంగా చెప్పుకుంటున్నారు. ఏదేమైనా కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు 1979లో చివరగా విజయనగరం జిల్లా ఏర్పాటు అయ్యాక ఆంధ్రాలో మళ్లీ కొత్త జిల్లా ఏర్పాటే కాలేదు.. అంటే దాదాపు 40 ఏళ్లుగా పాత జిల్లాలే ఉంటున్నాయి.


జనాభా పెరుగుతున్నా.. అవసరాలు పెరుగుతున్నా జిల్లాల విభజన మాత్రం జరగలేదు. అయితే.. ఇప్పుడు ఈ కొత్త జిల్లాల సంబంరం చూసి టీడీపీ నాయకులు ఉడుక్కుంటున్నారు. వాస్తవానికి ఈ అవకాశం చంద్రబాబుకు ముందుగా వచ్చింది. ఎందుకంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణ విడిపోయాక తెలంగాణలో చంద్రశేఖర్ రావు, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అక్కడ కేసీఆర్ అధికారంలోకి రాగానే జిల్లాల విభజన పై దృష్టి సారించారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే కేసీఆర్ తెలంగాణలోని పది జిల్లాలను 33 జిల్లాలకు పెంచుకున్నారు.


కేసీఆర్ తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఏపీలోనూ కొత్త జిల్లాలు చేసుకోవచ్చు కదా అన్న వాదన వినిపించింది.. కానీ చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదు. ఉన్న జిల్లాలు చాల్లే అనుకున్నారు. అంతే తప్ప.. పక్కన ఉన్న కేసీఆర్‌ ను చూసయినా తాను కూడా ఏపీలో కొత్త జిల్లాలూు తీసుకురావాలని అనుకోలేదు. సరిగ్గా దీన్నే జగన్ అందిపుచ్చుకున్నాడు. తాను అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటునూ ఓ జిల్లా చేస్తానని ప్రకటించాడు.


ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అన్నది చేసి చూపించాడు. ఇప్పుడు అసలు.. మా చంద్రబాబే ఈ పని చేసి ఉంటే.. ఎంత బావుండేది.. అవకాశం వచ్చినా మా బాబు వినిపించుకోలేదని టీడీపీ నాయకులు ఉడుక్కుంటున్నారు. కానీ ఇప్పుడు వగచి ఏం ప్రయోజనం.. చంద్రబాబు ఓ గొప్ప ఛాన్స్ మిస్ అయ్యారని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: