జగన్ కౌంటర్‌కు పవన్ ఎన్కౌంటర్ అదిరిపోయిందిగా?
అంతే కాదు.. పవన్ కల్యాణ్ టీడీపీకి బీ టీమ్ అని కూడా కొన్నాళ్ల నుంచి వైసీపీ నాయకులు విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పడు అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్ కల్యాణ్ జగన్ విమర్శలపై ఘాటుగా స్పందించారు. తనను చంద్రబాబు అంటే సీబీఎన్‌కు దత్త పుత్రుడు అని అంటే.. తాను జగన్‌ను సి.బి.ఐ.కి దత్త పుత్రుడు అని పిలవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే జనసేనను టీడీపీ బి టీం అని విమర్శిస్తే.. తాను కూడా వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీం అంటానని పవన్ కల్యాణ్ ఘాటుగా విమర్శించారు.
వైసీపీ నేతలేమీ దేశం కోసం జైలుకు వెళ్లలేదని.. వారు ఆర్థిక నేరాలు చేసి జైలుకు వెళ్లారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్.. 16 నెలలు జైల్లో కూర్చొని వచ్చిన మీరా నీతులు చెప్పేది అని ఎద్దేవా చేశారు. తాను కౌలు రైతుల పరామర్శకు వస్తున్నాను అని తెలియగానే బాధిత రైతులకు పరిహారం ఇస్తున్నారని.. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.7 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు.
వైసీపీ అగ్ర నాయకత్వానికీ, తనను తిట్టే వ్యక్తులకు ఒకటే చెబుతున్నానని.. తానేమీ ఏమీ విదేశాల్లో చదువుకోలేదని.. లండన్ రాయల్ ఫ్యామిలీ కాదని.. ప్రకాశం జిల్లాలో పెరిగిన వాడిని కాబట్టి.. మీరు తిట్టే భాష కంటే చాలా మంచి భాష తనకు వచ్చని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. కేవలం పక్కదారి
పట్టించడం ఇష్టం లేకనే అవన్నీ మాట్లాడటం లేదని పవన్ అంటున్నారు. మరి పవన్ ఎన్ కౌంటర్‌పై మళ్లీ వైసీపీ స్పందిస్తుందా.. చూడాలి.