70MM.. సింగిల్ Mm: జగన్‌పై లోకేశ్ అదిరే సెటైర్లు?
జగన్ మాఫియారాజ్ పాలన వల్ల అన్నిటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయని నారా లోకేశ్ అంటున్నారు. ఆఖరికి మృతదేహాన్ని తీసుకెళ్లాలన్నా.. మాఫియా చెప్పినట్లే నడుచుకునే పరిస్థితి నెలకొందని నారా లోకేశ్ అన్నారు. పిడుగురాళ్లలో అక్రమంగా నిర్బంధించిన చిన్న పిల్లల వ్యవహారాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని నారా లోకేశ్ అంటున్నారు. వారు ఏం పాపం చేశారని స్టేషన్ లో పెడతారని నారా లోకేశ్ ప్రశ్నించారు.
జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలకు 70ఎంఎం రేంజ్ లో హామిలు ఇచ్చారని నారా లోకేశ్ అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఎంఎం కూడా పనిచేయలేదని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. పాదయాత్ర సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామి ఇచ్చారని.. కానీ.. అధికారంలోకి వచ్చాక సజ్జల మా ముఖ్యమంత్రికి అవగాన లేక హామి ఇచ్చారని నారా లోకేశ్ గుర్తు చేశారు. ఆయన ఇలా చెప్పారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
మొత్తం మీద చంద్రబాబు.. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరవ్వకూడదని టీడీపీ నిర్ణయించింది. ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది లేదని టీడీపీ భావిస్తోంది. ఏం చేసుకుంటారో చేసుకోవచ్చని టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. అంతే కాకుండా సరిగ్గా విచారణకు రమ్మన్న రోజునే టీడీపీ నిరసనలకు పిలుపు ఇచ్చి.. ఇష్యూను మరింత రంజుగా మార్చేసింది. మరి ఈ టీడీపీ వైఖరిపట్ల వాసిరెడ్డి పద్మ ఎలా స్పందిస్తారో చూడాలి.