వాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన జగన్.. ఏకంగా 1900 కోట్లు?
అలాగే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించాలని సీఎం వారిని ఆదేశించారు. ఉపాధి హామీలో చెరువుల్లో పూడిక తీత పనులతో పాటు నీటి సామర్థ్యం పెంచేలా కాలువలు తవ్వకానికీ అనుమతించనున్నట్లు సీఎం జగన్ పంచాయతీ రాజ్ సమీక్షలో తెలిపారు. స్వచ్చ సంకల్పం పై పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరలోనే క్లియర్ చేయాలని కూడా సీఎం జగన్ ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.
ఉపాధి హామీ పథకంపై సమీక్షించిన జగన్.. ఉపాధి హామీ ద్వారా చెరువులను కాలువల ద్వారా అనుసంధానం చేయాలని సూచించారు. ఇలా చేస్తే వచ్చే ఐదేళ్లలో ప్రతి చెరువును కెనాల్స్, ఫీడర్ ఛానెల్స్‌కి లింక్ చేయవచ్చన్నారు. దీని ద్వారా నీటి ఎద్దడిని నివారించగలుగుతామన్న సీఎం... కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కాలువలు ద్వారా ట్యాంకులను కలపాలన్నారు. దీనిపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
అలాగే ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, విలేజీ క్లినిక్స్‌కు సంబంధించిన భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు. ఉపాధి హామీ పనులుకు సంబంధించిన బిల్లులు అప్లోడ్, చెల్లింపులు ఆలస్యం కాకూడదని సీఎం జగన్ సూచించారు. అవసరమైతే దీని కోసం దిల్లీ స్ధాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. గ్రామాల్లో మురుగునీటి కాలువలు నిర్వహణ, చెత్త సేకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు.