అమరావతి నిధుల కోసం జగన్‌ కొత్త ప్లాన్‌?

అమరావతిని అభివృద్ది చేయాల్సిందేనని హైకోర్టు చెబుతోంది. అందుకే నిధుల కోసం జగన్ సర్కారు కొత్త ప్లాన్ రూపొందించింది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో  జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రియల్ ఎస్టేట్ డెవలపర్లతో సీఆర్డీఏ సమావేశాన్ని నిర్వహించింది.  మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు సీఆర్డీఏ కార్యాచరణ రెడీ చేసింది.

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంఐజీ స్మార్ట్ టౌన్ షిప్ ల అభివృద్ధి చేయాలని  సీఆర్డీఏ నిర్ణయించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతోనే స్మార్ట్ టౌన్ షిప్ లను సీఆర్డీఏ  అభివృద్ధి చేయనుంది. ఏపీసీఆర్డీఏ పరిధిలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు,బాపట్ల జిల్లాల్లో ఎంఐజీ లే అవుట్లు వేయాలని ఆలోచిస్తోంది. కనీసం 20 ఎకరాల పరిధిలో లేఅవుట్లు వేసేలా కార్యాచరణ రెడీ చేస్తోంది.

ఈ లే ఔట్లలో 150, 200, 240 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉండేలా ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధి చేయనున్నారు. ఈ నెల 20 తేదీన ఎంఐజీ లే అవుట్లకు సంబంధించి ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో పాయకాపురం, తెనాలిలోని  చెంచుపేట, అమరావతి, ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ టౌన్ షిప్ లలో ఇ-వేలం ద్వారా ప్లాట్ల విక్రయాలు  చేయాలని కూడా జగన్ సర్కారు భావిస్తోంది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అయితే.. ఈ ప్లాన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జగన్ సర్కారు అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం అన్న విషయం ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో ప్లాట్లు కొనేందుకు ఎవరు ముందు వస్తారు.. ఈ ప్లాట్లు వేలంలో అమ్ముడవుతాయా అన్న సందేహం ఉంది. ఇదంతా కోర్టును ఏదో చేస్తున్నామని నమ్మించేందుకు తప్ప.. నిజంగా చిత్తు శుద్దితో కాదన్న విమర్శ కూడా వినిపిస్తోంది. అయితే.. సీఆర్‌డీఏ పూర్తి ప్రణాళిక విడుదల చేస్తే కానీ.. అసలు విషయం ఏంటో పూర్తిగా అవగతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: