ఇండియా ది గ్రేట్.. 2029లో టాప్‌ 3 ప్లేస్‌?

భారత్ దూసుకుపోతోంది. బలమైన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో రోజురోజుకూ మన పాత్ర బలీయంగా మారుతోంది. దశాబ్దం క్రితం వరకూ టాప్ 10లోనూ చోటు సంపాదించుకోలేకపోయిన ఇండియా ఇప్పుడు ఏకంగా టాప్ 5లోకి చేరిపోయింది. బ్రిటన్‌ను తోసి రాజని ఇప్పుడు ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ఐదో ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. ఈ విషయాన్నిఅంతర్జాయ సంస్థలే చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఇప్పుడు ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకూ ఆ ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్ ఇక ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది.


2021 ఏడాది చివరి 3 నెలల్లో బ్రిటన్ ను భారత్ వెనక్కి నెట్టేసింది. బ్రిటన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఓ పక్క బ్రిటన్‌లో  జీవన వ్యయం భారీగా పెరిగిపోతోంది. మరో వైపు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పడిపోతోంది. దీంతో ఇవన్నీ బ్రిటన్ ను దారుణంగా దెబ్బతీశాయి. ఈ ఏడాది మెుదటి త్రైమాసికం జీడీపీలో భారత్ గణనీయమైన వృద్ధి సాధించినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ లెక్కలు చెబుతున్నాయి. గత 4 దశాబ్దాల్లో బ్రిటన్ లో వేగంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతూ వస్తోంది. ఈ ట్రెండ్  2024 వరకు కొనసాగవచ్చని ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వెల్లడించింది.


బ్రిటన్ పరిస్థితి ఇలా ఉంటే.. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఈ త్రైమాసికంలో చైనా తర్వాత భారతీయ స్టాక్ లు పుంజుకోవడం కూడా మరో సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. గత త్రైమాసికం చివరి రోజు.డాలర్ మారకపు విలువ ఆధారంగా...ఐఎంఎఫ్‌ , బ్లూమ్ బర్గ్ సంస్థలు అంచనా వేసిన లెక్కల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ విలువ 854.7 బిలియన్ డాలర్లుకు పెరిగింది. ఇదే సమయంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ విలువ 816 బిలియన్ డాలర్లుకు పడిపోయింది.


అంతే కాదు.. భారత కరెన్సీతో పోలిస్తే ఈ ఏడాది బ్రిటన్ పౌండ్ విలువ 8 శాతం పడిపోయింది. తాజాగా ప్రపంచం టాప్‌ 5 లెక్కలు చూస్తే.. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ ఫస్ట్ 4 స్థానాల్లో ఉండగా.. భారత్ ఐదో ప్లేసుకు చేరుకుంది. అయితే.. 2029 నాటికి ఇండియా జర్మనీ, జపాన్‌లను కూడా అధిగమించి టాప్‌ 3 ప్లేస్‌కు చేరుతుందని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: