అన్ని పార్టీలు పవన్‌ ను బెదిరిస్తున్నాయా?

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ కార్యాలయంలో సోదాలు జరిగాయి. అయితే పన్నుఎగవేశారన్న కోణంలో సోదాలు జరిగాయి. సాధారణంగా.. ఈడీ, ఐటీ దాడులు చేస్తే మాత్రం స్టేట్ మెంట్లు విడుదల చేస్తారు. జీఎస్టీ అధికారులు మాత్రం దస్త్రాలు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు కానీ.. ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కాగా... ఈ దాడులనే అధికార వైఎస్ఆర్ సీపీ అస్త్రంగా వాడుకుంది. బీజేపీతోనే పవన్ ఉండాలని.. అందులో భాగంగానే ఈ సోదాలని విస్తృతంగా ప్రచారం జరుపుతోంది.


మరోవైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డి, పవన్ భగత్ సింగ్ చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ జరుపుతోంది. వివిధ పార్టీల్లో ఉన్న అగ్రహీరోల కామన్ లింక్ ఈ ప్రొడక్షన్ సంస్థ. అయితే మైత్రీ మేకర్స్ పైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనే పాయింట్ తో ఈ దాడుల్ని రాజకీయంగా మార్చింది అధికార పార్టీ. తెలుగు దేశం, జనసేన కలిసి పోటీ చేయొద్దని బీజేపీ ముందస్తు జాగ్రత్తలో భాగం ఈ దాడులు అని కొందరంటున్నారు. టికెట్ల ధరల్ని కంట్రోల్ చేసి పవన్ మూవీని దెబ్బతీసినట్లే.. ఈసారి కూడా దాడులతో బెదిరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే దీన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో లేదో వేచి చూడాలి.


ఇదే సమయంలో పవన్ కల్యాణ్‌ ఏపీలో ఎన్నికల్లో ఏ పార్టీతో జట్టుకడతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.. అటు బీజేపీ, ఇటు టీడీపీ రెండు కూడా పవన్‌ తో పొత్తుతోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి. అయితే.. ఈ మూడు పార్టీలు కూడా కలసి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కూడా తోసిపుచ్చలేం.. అది జరగాలంటే.. బీజేపీ, టీడీపీ మధ్య అవగాహన కుదరాల్సి ఉంది. అది అంత సులభం కాదు. మరి ఈ ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ ముందు ముందు ఎన్ని మలుపులు తీసుకుంటుందో.. ఏపీ రాజకీయాల్లో ఏ మార్పులు తెస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: