బర్త్‌డే స్పెషల్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జగన్ అరుదైన రికార్డ్?
వైయస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సూరీడు, రోజూ మారుతీ కారులో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిన డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాడట. మధ్యాహ్నం మూడు గంటలకే క్లాసులు పూర్తయినా, సాయంత్రం దాకా స్కూల్లోనే మిత్రులతో ఉండిపోయేవాడట. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హౌజ్ కెప్టెన్ అయ్యారట. స్కూల్లో ఉన్న విద్యార్థులందరినీ నాలుగు హౌజ్‌లుగా విభజిస్తారు. వాటికి రెడ్ హౌజ్, బ్లూ హౌజ్, గ్రీన్ హౌజ్, ఎల్లో హౌజ్ అని పేర్లు ఉంటాయి. ఏ పోటీలు జరిగినా.. ఆ నాలుగు హౌజ్‌ల మధ్యే. 12వ తరగతిలో ఉన్నవాళ్లకి మాత్రమే హౌజ్ కెప్టెన్సీ దక్కుతుందట.
జగన్ 12వ తరగతిలో ఉన్నప్పుడు రెడ్ హౌజ్‌కు కెప్టెన్ అయ్యాడట. ఆ సంవత్సరం తన హౌస్‌కు ఆల్ రౌండ్ ఛాంపియన్షిప్ సాధించిన ఘనత కూడా దక్కించుకున్నాడట. అంతకు ముందుగా పదేళ్లుగా రెడ్ హౌజ్‌కు దక్కని గౌరవం.. జగన్ ఉన్నప్పుడే దక్కిందట. వైయస్ జగన్మోహన్రెడ్డి కంటే ముందు చెన్నారెడ్డి మనవడు ఆదిత్యరెడ్డి రెడ్ హౌస్ కెప్టెన్‌గా వ్యవహరించాడట. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆదిత్యరెడ్డి 12వ తరగతి చదువు, రెడ్ హౌస్ కెప్టెన్సీ ముగిసిన సంవత్సరమే చెన్నారెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోయారట.
ఆ సంవత్సరం ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అవుతారనుకున్న రాజశేఖర్‌రెడ్డి కాలేకపోయారు. ఆదిత్యరెడ్డి స్థానంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రెడ్ హౌస్ కెప్టెన్ పదవి మాత్రం వైయస్ జగన్మోహన్రెడ్డిని వరించిందని ఆయన స్నేహితులు చెప్పుకుంటారు.