సానుభూతి కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారా?
చంద్రబాబు చెప్పుకుంటున్నట్టు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి కూడా పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని చంద్రబాబు అనరాని మాటలు అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. కుప్పంలో కూర్చుని తన విష ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన 174 నియోజవర్గాల ప్రజలను మాయచేయాలని.. బురిడీ కొట్టించాలని చంద్రబాబు పన్నాగాలు పన్నుతున్నట్టు కనిపిస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.
విస్తృతానుభవంతో సమయస్ఫూర్తి గల రాజకీయవేత్తగా నడుచుకోవాల్సిన చంద్రబాబు ఇలా రెచ్చిపోయి మాట్లాడడం దేనికి సంకేతమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబును ఓటమి భయం వెంటాడుతోందా.. లేదా ఏ మాత్రం వాస్తవానికి దగ్గరగా లేని అభియోగాలతో 2024 ఏపీ శాసనసభ ఎన్నికల్లో గెలవగలనని ఆయన కలలు కంటున్నారా అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిలదీశారు. ఇవి తన అనుమానాలు కావని.. ఇవే అనుమానాలు ఇప్పుడు సామాన్య ప్రజానీకానికి కూడా వస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అంటున్నారు.
అసలు అప్రకటిత ఎమర్జెన్సీలో వీధిపోరాటాలకు వీలుంటుందా అని విజయసాయి రెడ్డి నిలదీశారు. ఫెయిల్డ్ సీఎం అని జగన్‌ను నిర్ధారించిన ఈ మాజీ ముఖ్యమంత్రి ఏ రంగాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైందో చెప్పడం లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు.