భారతీయులే.. ప్రపంచానికి ఆశాదీపాలు?
ఇప్పుడు ప్రపంచమంతా రెసిషన్ తో తల్లడిల్లిపోతున్న వేళ దానికి కూడా ఒక మార్గం చూపించగలిగేది.. చూపించేది మన భారతీయులే. మన భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు బలంగానే ఉంది. 62శాతం మంది ప్రజల ఫీలింగ్ ఏంటంటే 2022 లో మిగిలిన దేశాలతో పోలిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ కంట్రోల్లోనే ఉందని. ప్రస్తుత ప్రభుత్వం దానిని, ఆ ఘనతను సాధించిందని వాళ్ల భావన. మన భారతదేశంలోని రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాల్లాంటి 36 చోట్ల నిర్వహించిన "యాక్సిస్ బై ఇండియా" సర్వేలో వెళ్లడైంది ఏంటంటే.. 29% ప్రజలు ఈ సంవత్సరం బెటర్ ఎంప్లాయిమెంట్ అవకాశాలు ఉంటాయని ఎదురుచూస్తున్నారట.
రూపాయి పతనం అవ్వకండా భారత్ కంట్రోల్ చేయగలిగిందని ప్రపంచమంతా కూడా భారత్ పై ఇప్పుడు ఒక ఫీలింగ్ ఉంది. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని కరెక్ట్ గా కంట్రోల్ చేయగలుగుతుందని భారతదేశం పై ఒక గుడ్ విల్ ఉంది. ఒకవైపు ధరల పెరుగుదల సమస్య ఇక్కడ కూడా ఉన్నా అది సాధారణంగా ప్రపంచమంతా జరుగుతున్న ఉమ్మడి సమస్య గానే భావిస్తున్నారు. భారతదేశానికి సాధారణంగా వచ్చే సమస్యల పట్ల కూడా ముందుచూపుతో వ్యవహరించి వాటిని ఎంతో ప్రతిభతో చక్కదిద్దగలిగే సామర్థ్యం మెండుగా ఉంది. అది ఇప్పుడు మిగిలిన దేశాలకి కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది.