అమెరికాలోకి చొరబడిన రష్యా.. ప్రపంచ యుద్ధమేనా?
ఒకటి కాకుండా నాలుగు యుద్ధ విమానాలు అమెరికా గగన తలంలోకి వచ్చాయని నిర్దారించింది. సుఖోయ్ 30 బాంబర్, టీయూ 95 యుద్ధ విమానం, సుఖోయ్ 35 పైటర్ ఎయిర్ క్రాప్ట్ అనే యుద్ధ విమానాలు ఫిబ్రవరిలో అమెరికా గగనతలంలో ప్రవేశించాయని పేర్కొంది. మొత్తం నాలుగు యుద్ధ విమానాలు అమెరికా గగనతలంలోకి ప్రవేశించినట్లు తెలిపింది.
అయితే రష్యా రోటీన్ గా తాను వెళ్లే సముద్ర గగన తలాల్లో వెళ్లినా అమెరికా లేని పోనివి కల్పించుకుని డైరెక్టుగా యుద్ధంలోకి తానే దిగాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రష్యా ఎయిర్ క్రాప్ట్ లు, యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించాయని వైట్ హౌస్ ఆరోపిస్తోంది. దీన్ని బూచిగా చూపి రష్యాతో నేరుగా యుద్ధం చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి అమెరికా, రష్యాతో నేరుగా యుద్దం చేస్తే తలెత్తే పరిస్థితులు ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది.
రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే నష్టపోయేది ప్రపంచం. రెండు ప్రపంచ యుద్ధాల్లో ఎంతటి బీభత్సం జరిగిందో అందరికి తెలిసిందే. హిరోషిమా, నాగసాకి లాంటి ప్రాంతాల్లో ఇప్పటికి నివసించలేని పరిస్థితి. రష్యా, అమెరికా నేరుగా యుద్ధం చేస్తే ప్రపంచమే అతలాకుతలం అవుతుందనడంలో సందేహం లేదు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కాస్త ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితులు తలపిస్తున్నాయి. ఏదేమైనా అమెరికా గగనతలంలోకి యుద్ధ విమానాలు రావడం ఆందోళన కలిగించే అంశమే. దీన్ని అగ్రరాజ్యం ఏ మేరకు సీరియస్ గా తీసుకుంటుందో ఏం జరుగుతుందో చూడాలి.