తాలిబన్లు.. భారత సాయం కోరుతున్నారా?

ఆఫ్గానిస్తాన్ లోని తీవ్రవాదులకు పాకిస్థాన్ గతం నుంచే సాయం చేస్తోంది. భారత్ మాత్రం తీవ్రవాదాన్ని అణిచివేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కానీ ప్రస్తుతం తీవ్రవాదులకు వివిధ దేశాల సాయం కావాల్సి వస్తోంది. భారత్ తీవ్రవాద బాధిత దేశం. ప్రస్తుతం ఓ తీవ్రవాద సంస్థ చైనా పై విద్వేషం పెంచుకుంది. వీగర్ ముస్లింలకు సంబంధించి చైనాలో జరుగతున్న దాడులపై ఆల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ చైనాలో దాడులు చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలు అల్ ఖైదాకు అస్సలు సహకరించవు.


తాలిబాన్లకు సహకరించిన అమెరికా పరిస్థితి ఏమైంది. తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకున్న పాకిస్థాన్ గతి ఇప్పుడు ఏమవుతుంది. కాబట్టి భారత్ దగ్గరకు ఈ విషయం వచ్చింది. భారత్ మాత్రం ఈ విషయాన్ని వెంటనే ఖండించింది. అలాంటి సాయాలేమీ చేయమని చెప్పింది. తుర్కిస్తాన్ ఇస్లామిక్ పార్టీ మిలిటెంట్ గ్రూప్ కు అప్ అల్ ఖైదా తో సంబంధాలు ఉన్నాయి. చైనాలో ఉన్న వీగర్ ముస్లింలను ఇండియాకు తీసుకొచ్చి వారికి ఆశ్రయం కల్పించాలని వీరు అడుగుతున్నారు. చైనాతో  పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం కానీ వీగర్ ముస్లింలను ఇండియాలో చేర్చుకోండి అని అన్నారు. ఇంతకంటే దారుణమైనది ఏదీ ఉండదు.


అయితే ఇప్పటికే బర్మా, రోహింగ్యా ముస్లింలతో నే భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వీరికి ఆశ్రయం కల్పించ లేకే భారత్ నానా అవస్థలు పడుతోంది. చాలా మంది శరణార్థులుగా వచ్చిన వారు ఉన్నారు. వారికే ఇప్పటికి ఆశ్రయం లేదు. ఇప్పుడు చైనా వారితో మనం సంబంధాలు తెగ్గొట్టుకుని వీగర్ ముస్లింలను తీసుకొచ్చి ఇండియాలో పెట్టుకుంటే ఇప్పటికే డ్రాగన్ కంట్రీతో ఉన్న విభేదాలు చాలవన్నట్లు ఇదొక మరొ వివాదం అయి కూర్చుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని భారత్ ముందుగానే తెలుసుకొని అల్ ఖైదా ముఠాకు అస్సలు సహకరించేది లేదని తేల్చి చెప్పింది. తీవ్రవాదులతో ఏ మాత్రం సఖ్యంగా ఉన్న చివరకు మనకు మిగిలేది శూన్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: