అద్భుతం: గుండె చికిత్సలో కొత్త ప్రయోగం?

గుండె దెబ్బ తింటే సాధారణంగా ప్రాణాలు కోల్పోవాల్సిందే.  బైపాస్ సర్జరీ ద్వారా గుండెకు ఇప్పటివరకు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. దీని ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. కొంతమందికి స్టంట్ లు వేసి రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తూ గుండెను కాపాడుకుంటూనే మనిషి ప్రాణాలను నిలబెడుతున్నారు.


ఇలా కాకుండా ప్రోటీన్ విధానంలో చికిత్స చేస్తూ గుండెను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. రీకాంబినెంట్ ప్రోటీన్ టూల్ బాక్స్ అని గౌహతిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందులో ఆరు ప్రత్యేక ప్రోటీన్ లు ఉంటాయి. ఇవి మానవ చర్మం నుంచి సేకరించిన కణాలను గుండె కణాలుగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఇవి అచ్చం గుండె తరహ కణాలతోనే తయారు చేస్తాయి. దెబ్బతిన్న హృదయ కణజాల తీరును పునరుద్దరించడానికి ఉపయోగపడతాయి. గుండెలోని ఒక భాగం దెబ్బతిన్నప్పుడు గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది.


టీబ్రాఫిష్ అనే కొన్ని జీవుల్లో దెబ్బతిన్న గుండె తిరిగి దానికదే వృద్ధి చెందుతుంది. కానీ మానవుల్లో ఇలాంటి ప్రక్రియ ఉండదు. కొత్త గుండె కణాలు వృద్ధి చెందడానికి బదులు స్కార్ కణజాలం ఏర్పడుతుంది. పూర్తిగా దెబ్బతిన్న గుండెకు సరిపడా అవయవాలు అందుబాటులో ఉండటం లేదు. పైగా మార్పిడి చేసినా రోగి శరీరం సాఫీగా స్వీకరిస్తుందా అన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో సాధారణ కణాలను గుండె కణాలుగా మార్చడానికి ఉన్న అవకాశాలను శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు.


అయితే దెబ్బతిన్న గుండె పునరుజ్జీవనానికి ఇవి సాయపడతాయని అంటున్నారు. మార్పిడి ప్రక్రియలో కణాలు ప్రమాదకరంగా మారవచ్చు. అందువల్ల సురక్షితమైన విధానాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. అయితే ఈ విధానంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేయాల్సి రావచ్చు. ఏదైమైనా దెబ్బతిన్న గుండెకు చికిత్సలో కొత్త విధానం రావడం రాబోయే తరాలకు ఎంత గానో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: