భారత్‌ను చూసి షాకవుతున్న అమెరికా, బ్రిటన్?
అయితే దీనిపై భారత్ ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకులే భారత ఆర్థిక వ్యవస్థల్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటానికి కారణం.. రష్యా, ఉక్రెయిన్ యుద్దం మొదలైన నాటి నుంచి మన దేశ విదేశాంగ విధానం న్యూట్రల్ గా ఉండటం, అటు రష్యాకు, ఇటు అమెరికాకు దూరం కాకుండా న్యూట్రల్ గా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఇది ఆర్థికంగా బలంగా ఉండేందుకు తోడ్పడిందని చెప్పొచ్చు.
శాంతికి సంబంధించిన సమయంలో ఉక్రెయిన్, రష్యాకు సలహాలు ఇచ్చాం. కానీ అంతకుమించి ముందుకు పోయిన దాఖలాలు లేవు. మరో విషయం ఏమిటంటే రష్యా ఆయిల్ కొనుగోలు. ప్రపంచ దేశాలను మెప్పించి ఒప్పించి ఆయిల్ ను రష్యా నుంచి కొనుగోలు చేసుకుని ఇండియాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. వెస్ట్ హిపోక్రసీని ప్రపంచం ఎదుట ఎండగట్టాం. యూరప్ సమస్య ప్రపంచ సమస్య అవుతోంది. కానీ ప్రపంచ సమస్య యూరప్ సమస్య కావడం లేదనేది భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది.
అయితే ఇదే చర్చ ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైందని అనుకోవచ్చు. ఐక్యరాజ్యసమితిలో మరోసారి భారత్ తన విధానాన్ని ప్రకటించింది. భారత్ రష్యా, ఉక్రెయిన్ లలో ఏ దేశానికి మద్దతు ఇవ్వదని న్యూట్రల్ గానే ఉంటామని ఐక్య రాజ్య సమితిలో ఓటింగ్ సందర్భంగా దూరంగా ఉండి పోయింది.