సిక్కు ఉగ్రవాదాన్ని ఆ 4 దేశాలు ప్రోత్సహిస్తున్నాయా?
ప్రతి ఇంటి పెద్ద పెద్ద బిడ్డని సిక్కుగా ఇచ్చేయ్య బట్టే సిక్కు జాతి ఈనాటికీ బ్రతుకుంది. లేకపోతే సిక్కు జాతికి మూలపురుషుడైన గురు గోవింద్ సింగ్ కి ఏమైందో ఇదంతా చరిత్ర చెప్పేటువంటి నిజం . అయితే ఇక్కడ అసలు విషయం ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఎవరనేది, ఇక్కడ పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పోషిస్తుంటే, సిక్కు తీవ్రవాదాన్ని యూరప్ దేశాలు పోషిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని మానవ హక్కులు, పౌర హక్కులనే పేరుతో కాపాడుతున్న వేళ భారతదేశం జీ-20 సదస్సు సందర్భంగా అలాగే క్వాడ్ సందర్భంగా దానినే నిలదీసింది, దాని మీదే తప్పు పట్టింది.
వాళ్ళ చర్యలను తీవ్రవాదంగానే పరిగణిస్తాం, వాళ్ల ఉద్యమాలను ప్రోత్సహించమని ఒక నోటి స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు ఆస్ట్రేలియా వాళ్లు ఇంకా అమెరికా వాళ్ళు కూడా. హిందూ దేవాలయాలపై, వాటికి సంబంధించిన ఎలాంటి హింస మరియు తీవ్రవాదాన్నైనా మేము కచ్చితంగా ఖండిస్తాము, ఆ ఖలిస్తానీ తీవ్రవాద చర్యలపై యాక్షన్ తీసుకుంటామని బైడన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది, ఈ దాడులకు సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రజలకు సంబంధించిన ప్రధానమైన మతపరమైన స్వేచ్ఛకు అడ్డురావడాన్ని సహించబోమని అన్నారు.
ఇటీవల యూ.ఎస్, కెనడా, మరియు ప్రత్యేకించి ఆస్ట్రేలియాలోని అనేక హిందూ దేవాలయాలపై భారతీయ వ్యతిరేక శక్తులు దాడి చేశాయి. ఇప్పుడు ఆ తీవ్రవాద చర్యలను మేము ఖండిస్తాము, కఠిన చర్యలు ఉండాలని కోరుకుంటామని కేవలం నోటిమాట మాత్రమే చెప్తున్నారు గానీ చేతల్లో మాత్రం జరగడం లేదు.