వార్: ఉక్రెయిన్‌పై దారుణ ఆయుధం గురి పెట్టిన రష్యా?
ఈ యుద్ధం మొదలైన తర్వాత మొదటి సారి ఈ హైపర్ సోనిక్ యుద్ధ విమానాల్ని ప్రయోగించింది. ఇది ఎంత భీకరమైనవి అంటే దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నలక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదిస్తుంది. 10 శాతం ఎక్కువ సామర్థ్యం ఉన్న మిస్సైల్స్ అని చెబుతున్నారు. వీటిని మిగ్ 31 యుద్ధ విమానాల ద్వారా దీన్ని ప్రయోగించింది. వీటి రేడియేషన్ తగ్గించి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని ఛేదించింది. ముఖ్యంగా వీటికి ఉండే న్యూక్లియర్ వార్ హెడ్ లను తగ్గించింది.
లేకపోతే న్యూక్లియర్ బాంబ్ ఎటాక్ జరిగిదే. దీన్ని ఉక్రెయిన్ కు హెచ్చరికగా మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అమెరికా అండతో ఏ మాత్రం రెచ్చిపోయినా, రష్యాను రెచ్చగొట్టినా చివరకు నష్టపోయేది ఉక్రెయిన్ మాత్రమే కాదు దాని చుట్టు పక్కలా ఉన్న యూరప్ దేశాలు కూడా. ఇది అతి క్రూరమైన ఎటాక్ అని చెప్పొచ్చు. బాగ్ ముత్ సిటీ,కెమటస్క్, స్లోవియక్స్ ప్రాంతాలు కూడా ఉక్రెయిన్ నుంచి రష్యాకు స్వాధీనం కాబోతున్నట్లు తెలుస్తోంది.
కాబట్టి ఇప్పటికైనా ఉక్రెయిన్ తగ్గి లొంగిపోతే మిగిలిన ప్రాంతాలనైనా దాడులు కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది . కానీ అమెరికాను నమ్ముకుని ముందుకు పోతే మాత్రం చివరకు నష్టపోయేది మాత్రం ఉక్రెయిన్ అని చెప్పక తప్పదు.