పాపం చైనా.. దగ్గుకి, జలుబుకి కూడా లాక్ డౌనే?
మొన్నటికి మొన్న చైనా లో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోయాయి. దీని వల్ల ఎంతో నష్టం వాటిల్లింది.మళ్ళీ లాక్ డౌన్ పెట్టకపోవడం తో చైనా లో మొదటి కరోనాతో పోల్చుకుంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. కరోనా సమయంలో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రస్తుతం జలుబు, దగ్గు తో విపరీతంగా అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే లక్డౌన్ పెట్టాలని చూస్తోంది. జీవాయుధాలు తయారు చేయడం విఫలం కావడం తోనే కరోనా వైరస్ వచ్చిందని అమెరికా ఆరోపిస్తోంది. అది కూడా వూహన్ లాబ్ లో నుంచి వైరస్ బయటకు వచ్చిందని చెప్పింది. చైనా ఈ విషయాన్ని గతంలోనే ఖండించింది.
కానీ ప్రస్తుతం అన్ని తెలిసి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక కూడా కఠిన లాక్ డౌన్ పెట్టడం మూర్కత్వం అవుతుంది.మొత్తం మీద కరోనా మొదటికే అంతం కాలేదన్న విషయం నాలుగు వేవ్ ల ద్వారా తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి అందరు బహిరంగ ప్రదేశాలకు వెళితే మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.