
యూట్యూబ్‌కు షాక్ ఇవ్వబోతున్న రష్యా?
రష్యా, చైనా కరెన్సీలలో ఇప్పటికే 40 నుంచి 50 దేశాలు వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి వ్యాపారాలు చేయడం వల్ల తమ దేశం అభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాయి. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్దం అనంతరం రష్యాలో గూగుల్, ఫేస్ బుక్ లాంటి సంస్థలు అస్సలు పనిచేయడం లేదు.
రష్యా దీనికి ప్రతిగా సరికొత్త నావిగేషన్, సెర్చ్ ఇంజన్, ఆన్ లైన్ విధానాల్ని అన్నింటిని ఇప్పటికే రెడీ చేసుకుని వాడుతోంది. ఈ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ముందుకు వెళుతోంది. గూగుల్ మీద ఆధారపడి ఉన్న చాలా దేశాలు రష్యాను చూసి నేర్చుకునేలా చేసింది. అయితే ఇప్పుడు పుతిన్ కన్ను యూట్యూబ్ మీద పడింది. యూట్యూబ్ లో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, ఉక్రెయిన్ రెండు దేశాలు కలిసి కొన్ని వేల వీడియోలను అప్ లోడ్ చేశాయి.
దీంతో రష్యా గురించి ప్రపంచ వ్యాప్తంగా నెగటివిని ప్రచారం చేస్తున్నాయని భావిస్తోంది. ఇది సరైంది కాదని భావించిన రష్యా కొత్త యూట్యూబ్ ను పెట్టాలని ఆలోచిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ ఎంత ఫేమసైందో అందరికి తెలిసిన విషయమే. కానీ యూట్యూబ్ లో రష్యా కు వ్యతిరేకంగా వస్తున్న అది అడ్డుకోకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దానికి ధీటుగా ఉండేలా ప్రత్యేక యూట్యూబ్ చానల్ ను పెట్టబోతుంది రష్యా. దీని కోసం చైనా నుంచి కొంత మంది సైబర్ నిపుణులు రష్యాలో ఈ పని ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది.