అమెరికా: ఎన్నారైలను ఆదుకుంటున్న భార్యలు?

ఏదైనా రంగంలో నిష్ణాతులైతే వారికి అమెరికా దేశానికి రావడానికి హెచ్ 1 బి వీసాలు ఇస్తుంది. ఇండియాకే కాకుండా ప్రపంచంలో ని అన్ని దేశాలకు అగ్రారాజ్యం వీసాలు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తుంది. ముఖ్యంగా ఇంజినీర్లు, సాప్ట్ వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు, నర్సులు, ఇలాంటి వారికి అమెరికా వీసాలు ఇచ్చి అక్కడి సంస్థల్లో పని చేసుకునేందుకు అంగీకరిస్తుంది.

అయితే అక్కడ ఉద్యోగానికి వెళ్లిన వ్యక్తి భార్య ఉద్యోగం చేయడానికి హెచ్ 4 వీసా ఇస్తారు. దీని గురించి ఈ మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. హెచ్ 4 వీసాలను చాలా రోజుల నుంచి అమెరికాలో  ఆపేశారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆ మధ్య అమెరికా భావించి వాటిని ట్రంపు హాయాంలో నిలిపివేసింది. కోర్టు లో ఈ మధ్య ఓ వ్యక్తి కేసు వేశారు. అమెరికా జాతీయుకలకు మాత్రమే ఉద్యోగాల్లో ముందు ప్రయారిటీ ఇవ్వాలని కేసు వేశారు. దీన్ని అక్కడి కోర్టు కొట్టివేసింది.

హెచ్ 1 బి వీసాలను తొలగిస్తున్న సమయంలో హెచ్ 4 వీసాలతో వారి జీవిత భాగస్వామి ఉద్యోగం చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. అమెరికాలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చాలా మంది టెకీలకు ఈ తీర్పుతో పెద్ద ఊరట లభించింది. అమెరికా టెక్నాలజీ రంగానికే కాకుండా టెక్ ఉద్యోగాలు చేసే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నాన్ హెచ్ 1 బి వీసాలతో భారతీయులకు ఉద్యోగాలు ఇస్తున్న కారణంగా అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలుస్తోంది.

హెచ్ 1 బి వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగాలు రావడంతో అమెరికన్లకు ఉద్యోగాలు దొరకడం లేదని సేవ్ జాబ్స్ యూఎస్ఏ వారు వాషింగ్జన్ కోర్టులో కేసు వేశారు. కోర్టు కేసును కొట్టేసింది.  ఈ దావాను అమెజాన్, గూగుల్, లాంటి కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ తీర్పును ఎగువ కోర్టులో దాఖలు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

NRI

సంబంధిత వార్తలు: