
రాముడి కళ్యాణం.. జగన్ కాలునొప్పి.. ఏంటి కథ?
అయితే.. చాలా మంది జగన్ భార్యను ఎందుకు తీసుకెళ్లడం లేదనే విమర్శలు వచ్చాయి. కానీ ఆయన సంప్రదాయబద్దంగానే తిరుమలకు వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించడం చేస్తుంటారు. తాజాగా టీడీపీ జగన్ మత అంశాన్ని లేవనెత్తింది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి రోజు కాకుండా వారం రోజుల తర్వాత సీతారాముల కల్యాణం జరుగుతుంది. గతంలో రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణలో ని భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించేవారు. ఇప్పుడు ఒంటిమిట్టలో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే సీఎం కాలు బెణికింది. ఎక్సర్ సైజు చేసే సమయంలో అని అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇది సీతారాముల కల్యాణానికి ముందు రోజు జరిగింది. కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు సీఎంవో నుంచి ప్రకటించారు.
ఆ మరునాడే డాక్టర్ ప్రోగ్రాం కు సంబంధించి ఇంటింటి కి డాక్టర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టినపుడు జగన్ మామూలుగానే నడిచారు. ఈ అంశాన్ని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జగన్ ని విమర్శిస్తూ కాలు నొప్పి ఇప్పుడే తగ్గిపోయిందా.. అని ప్రశ్నించారు. నిన్నటి దాకా బాగోలేదని అన్న సీఎం ఒక్క రోజులోనే ఎలా తిరిగి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. దీనిపై సీఎంవో స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక వేళ అచ్చెన్నాయుడు అడిగిన ప్రశ్నకు సీఎంవో ఏమని సమాధానం చెబుతుందోనని అందరూ వేచి చూస్తున్నారు.