భారత్‌ ఆయుధాలకు ప్రపంచ మార్కెట్‌లో గిరాకీ?

సంక్షోభాల నుంచి అవకాశాలు ఎలా మలుచుకోవాలో ప్రధాని నరేంద్ర మోదీని చూసి నేర్చుకోవాలంటున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అయితే ఆఫ్రికా దేశాలకు రష్యా పెట్రోల్ , డిజీల్ లను ఇప్పటికీ తక్కువ ధరకే ఇస్తోంది. కానీ గతంలో ఆయుధాలు ఇచ్చేది. ప్రస్తుతం రష్యాకే సరిపోవడం లేదు. కొత్త కొత్త ఆయుధాలు తయారు చేసినప్పటికీ ఆ దేశానికే సరిపోవడం లేదు.


అమెరికా, యూరప్ దేశాలు ఆఫ్రికా దేశాలకు ఇవ్వవు. అమెరికా దగ్గర ఒక ఆయుధం కొనాలంటే సుమారు రూ.300 అయితే రష్యా దాన్ని వంద రూపాయాలకే ఇస్తుంది. చైనా దగ్గర ఇంకా చీఫ్ గా దొరికిన దాని దగ్గర ఆఫ్రికా దేశాలు కొనవు. ఎందుకంటే నాణ్యంగా ఉండవు.  ఆఫ్రికా దేశాలు ఆయుధాల కోసం సెర్చ్ చేస్తున్నపుడు భారత్ పై వాటి దృష్టి పడింది. తక్కువ ధరకే నాణ్యమైన ఆయుధాలను సప్లై చేసేందుకు భారత్ సిద్ధపడుతోంది.


30 ఆఫ్రికా దేశాల ఆర్మీ ప్రతినిధులను ఇండియాకు పిలిపించి డ్రోన్లు, ఆయుధాలను వారినే చూసుకోవాలని చెప్పింది. తక్కువ ఖర్చుతోనే దొరుకుతుందని వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈజిప్టు, ఇథియోపియా, మొజాంబిక్, సిసెల్స్ కొంటామని ప్రకటించాయి. ఇప్పటికే 20 శాతం ఆయుధాలు ఆఫ్రికాకు వెళుతున్నాయి. తాజాగా రాయల్ మొరాకన్ ఆర్మీ 100 ట్రక్ లను ఆర్డర్ ఇచ్చింది. ఆయా దేశాల్లో  పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ఇవ్వడానికి భారత్ అంగీకారం తెలిపింది.


ఇండియాలో ని ఆకాశ్, బ్రహ్మోస్, యుద్ద హెలిక్యాప్టర్లు, ఇలాంటివి తీసుకోవడానికి అంగీకారం తెలిపాయి. పిలీప్పీన్ కూడా బ్రహ్మోస్ అడిగింది. మయన్మార్, సౌతాఫ్రికా  బ్రహ్మోస్ కావాలని కోరాయి. సౌతాఫ్రికాలో జరిగిన ఒక ఈవెంట్ భారత్ బ్రహ్మోస్ ను ప్రదర్శించింది . అక్కడ 24 దేశాలు కూడా  వీటిని కావాలని కోరాయి. ఇలా ఆఫ్రికా దేశాల ఆర్మీ నాయకులు భారత్ లో ఉన్న ఆయుధాలను చూసి మాకు కూడా కావాలన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: