ఫ్యామిలీ లేకపోవడమే మోడీకి ప్లస్సా?

ప్రధాని మోదీపై బీఆర్ ఎస్ నేతలు విమర్శల బాణం ఎక్కు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రారంభానికి వచ్చినపుడు రాజకీయ విమర్శలు చేయడం ఏమిటని బీఆర్ఎస్ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మోదీ తన స్పీచ్ లో బీఆర్ ఎస్ నాయకులపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై బీఆర్ ఎస్ మంత్రులు, నాయకులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.


కేంద్రం ఇస్తున్న పథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అందులో మొదటిది డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి కేంద్రం పట్టణాల్లో అయితే రూ. 2.80 లక్షలు, గ్రామాల్లో రూ.1.80 లక్షల వరకు అందిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇప్పించడం లేదు. ఆయుష్మాన్ భారత్ లో రూ. 5 లక్షల వరకు అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిని సరిగా ప్రజలకు అందించడం లేదు. ఆరోగ్య శ్రీ బాగానే ఉంది కదా అని చెబుతూ వస్తోంది. 10 పడకల ఆసుపత్రులు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కిందకు వర్తిస్తాయని చెబతున్నారు.  దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి రేషన్ అందుతుంది. దీనిపై కూడా బీఆర్ ఎస్, బీజేపీ మధ్య వాదనలు కొనసాగుతున్నాయి.


ఇంతవరకు రాజకీయ విమర్శలు చేసుకున్న బీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు మంత్రి ఎర్రబెల్లి మోదీ పై చేసిన వ్యాఖ్యలు దూమారంగా మారుతున్నాయి.  మంత్రి ఎర్రబెల్లి ప్రధానమంత్రిపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ కి కుటుంబం లేదు. ఉంటే ధరల పెరుగుదల గురించి మాట్లాడే వారు. ఆయనకు ఆ బాధ తెలియదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ కి ప్యామీలి ఉంటే అందరి రాజకీయ నాయకుల లాగా కోట్లు సంపాదించి పిల్లలకు ఇచ్చేవాడని, అలాంటి వ్యక్తిపై కుటుంబ పరంగా ఆరోపణలు చేయడం దారుణమని చాలా మంది ఎర్రబెల్లి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి.. వ్యక్తిగతంగా కాదని సలహాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: