కర్ణాటక: కులాల కొట్లాటలో బీజేపీ నెగ్గుకొస్తుందా?
అయితే ఒకప్పుడు జెడిఎస్ కి కంచుకోట అయినటువంటి ప్రాంతంలో 2018 ఎన్నికల్లో మొత్తం అక్కడ 69 నియోజక వర్గాలు, 10 జిల్లాలు ఉన్నాయి. పాత మైసూర్ ప్రాంతంలో కాంగ్రెస్ అక్కడ 20 సీట్లు గెలుచుకుంటే, జేడీఎస్ హైయెస్ట్ గా 29 సీట్లు గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 15 సీట్లు గెలుచుకుంటే ఇతరులు ఐదు గెలుచుకున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గట్టిగా అక్కడ కాన్సన్ట్రేషన్ చేసింది. అక్కడ ఒక్కళిగెర నాయకుడు, బెంగళూరు నిర్మాత కెప్పే గౌడా 108 అడుగుల విగ్రహాన్ని అక్కడ కట్టారు. బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే కూడా వేసారు. వందే భారత్ రైలును కూడా వేశారు.
250 కోట్లు పెట్టి మైసూర్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించారు. మాంజా లో కేఎంఎఫ్ అమూల్ సహకారంతో మెగా పాల డైరీ ని కూడా పెట్టుకోచ్చారు. మళ్లీ అమూల్ డైరీ పైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ విరుచుకు పడటం ద్వారా దానిని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంది. టోటల్ గా అయితే గనక ఈ మైసూర్, కర్ణాటకల్లో కనుక బిజెపి పుంజుకుంటే భారతీయ జనతా పార్టీ అధికారానికి అవకాశం ఉంటుంది. పుంజుకోకపోతే కనుక ఖచ్చితంగా జెడిఎస్ ఉంటుంది.