ఒక్క పదం తప్పు.. 30 లక్షల కాపీలు తగలెట్టారు?
కారణం ఏంటంటే తన మాట వినడం లేదు, తనను పట్టించుకోవట్లేదు, తనను ప్రశ్నిస్తున్నారు అనేటు వంటి పాయింట్ల మీద. పెద్ద పెద్ద నాయకులను కూడా తీసుకెళ్లి జైల్లో పడేశారు. తాజాగా చైనాలోని ఒక పత్రికలో జింపింగ్ పేరు మెన్షన్ చేశారు, చైనా అధ్యక్షుడు అని కూడా మెన్షన్ చేశారు. కానీ కామ్రేడ్ అని వ్రాయలేదట. అంతే వెంటనే అధ్యక్షుడి కార్యాలయం నుంచి ఆ పత్రికకు ఫోన్ వచ్చింది ఏమనుకుంటున్నావని.. దాంతో వణికిపోయిన పత్రికా సంస్థ ఆల్రెడీ ఇళ్ళకి చేరిపోయిన 30 లక్షల కాపీలను తిరిగి వెనక్కి తెప్పించుకుంది.
మళ్లీ కొత్తవి వేస్తానని చెప్పింది. ఒక్క కామ్రేడ్ అనే పదం పెట్టనందువల్ల 30 లక్షల పేపర్లను తీసేసారంటే చైనా దేశ అధ్యక్షుడిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా మందికి అర్థం అవడం లేదు. అలాగే ఇరాన్ అతి పెద్ద నియంత. తను చెప్పిందే వేదం కునైన్ కి. హిజాబ్ అనేది సాధారణంగా ముస్లిం స్త్రీలు తలకు ముసుగులా ధరించే వస్త్రాన్ని సూచిస్తుంది. హిజాబ్ అనేది అనేక రకాలుగా ధరిస్తారు.
తరచుగా అయితే తల ఇంకా మెడ చుట్టూ చుట్టి, జుట్టు, మెడ ఇంకా చెవులను కప్పి ఉంచి, ముఖం కనిపించేలా ఉండేలా ప్రత్యేకంగా హెడ్ స్కార్ఫ్‌లా ధరిస్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇరాన్ లాంటి దేశంలో ఈ హిజాబ్ పై ఆంక్షలు గట్టిగా ఉంటాయి. ఎంత ఎలా ఉంటాయంటే హిజాబ్ ధరించినా కూడా, జుట్టు కనపడిందని ఒక అమ్మాయిని చంపేసేంత. ఈ దుశ్చర్యని వ్యతిరేకించిన వాళ్ళందరినీ చంపేసేంత.