కేసీఆర్ టీమ్ తిట్టింది.. చంద్రబాబుకు తలనొప్పి?
అయితే హరీష్ రావు మాటలకు వెంటనే కారుమూరి నాగేశ్వరావు గారు స్పందించారు. ఆ వెంటనే హరీష్ రావు కూడా దానికి ఘాటుగానే ప్రతిస్పందించారు. ఇదంతా నిన్న జరిగిన విషయం. అయితే వాళ్లు మన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడుతున్నారు అని తెలుస్తుంది. మరి వాళ్ళు మన స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఏం రాయాలి. ఎవరి మీద రాయాలి.
తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీలను పునరుద్ధరిస్తానని 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ద ఎత్తున చర్చకు తీసుకువచ్చిన హామీని ఆ తర్వాత కేసీఆర్ ఎందుకు నెరవేర్చలేదని ఆ ఇండస్ట్రీల పేర్లు చెప్పాలి. ఆ వార్త రాయాలి. కానీ ఇక్కడ మనల్ని వ్యాఖ్యానించిన వాళ్ళని వదిలేసి, అసలు విషయం వదిలేసి మన వాళ్ల మీద ఉన్న కోపాన్ని మన ప్రత్యర్ధుల మీద చూపించడం అనేది దారి లేక డైవర్షన్ అవడం అనే పాయింట్ గా కనిపిస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
తిట్టిందేమో కెసిఆర్ టీం అయితే వీళ్లు టార్గెట్ చేస్తుంది మాత్రం ఇక్కడ చంద్రబాబు నాయుడుని. ఇంతకీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద రాసిన మేటర్ ఏంటంటే, బాబు ప్రైవేట్ మాస్టర్ అని, 54 సంస్థల వరకు ప్రైవేట్ పరం చేశారు అని. అయితే ఆ మాట లో నిజం ఉందని, కానీ దానిమీద ప్రస్తుతం ప్రశ్నించవలసింది ఎవరిని అని కొంతమంది అడుగుతున్నారు.