ఉక్రెయిన్ డ్రోన్లను గాల్లోనే పేల్చేస్తున్న రష్యా?
ఈ అమెరికా, యూరప్ దేశాల నుండి వచ్చిన డ్రోన్లతో రష్యాపై ఎటాక్ ప్లాన్ చేస్తుంది ఉక్రెయిన్. ఈ రష్యా కూడా ఉక్రెయిన్ సైన్యాన్ని ఈ డ్రోన్ల సహాయంతోనే కనిపెట్టి మరీ మిస్సైల్స్ తో వెనకనుంచి ఎటాక్ చేస్తుంది. ఇప్పుడు రష్యా కూడా అదే విధంగా డ్రోన్ల సహాయంతో అటాక్ చేయడానికి డ్రోన్లకి ఆయుధాలని సెట్ చేసి మరీ రష్యాపై అటాక్ చేస్తుంది. అయితే ఈ డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టం ద్వారా పేల్చివేస్తుంది రష్యా.
యుద్దభూమిలో 24 గంటల వ్యవధిలో 11 ఉక్రేనియన్ యు.ఎ.విలను నాశనం చేసినట్లు రష్యా వైమానిక రక్షణ దళాలు పేర్కొన్నాయి. దాని యుద్ధానికి సంబంధించిన రోజు వారీ అప్డేట్ లో రష్యన్ మిలిటరీ టాప్ క్లాస్ లో ఉందని చెప్పుకొస్తుంది రష్యా. రష్యా బలగాలు కుపియాన్స్క్లో ఉక్రేనియన్ ఆర్మీ యూనిట్లను ఇరుక్కుపోయేలా చేసి 30కి పైగా ఉక్రేనియన్ దళాలను, అలాగే కార్కివ్ లోని మందుగుండు సామగ్రి డిపోను తొలగించాయి.
కార్కివ్ లో ఉన్న ఉక్రెయిన్ కి సంబంధించిన ఆయుధ కర్మగారాలను ధ్వంసం చేశామని, వాళ్ల నుండి వస్తున్న 14 డ్రోన్లను గాలిలోనే ధ్వంసం చేసామని, మిగతా వాటిని డైవర్ట్ చేయగలిగామనీ, అంటే అవి పేలినా రష్యన్ సైన్యం మీద పేలకుండా ఆ పక్కన ఉన్న ప్రాంతాలపై పేలేటట్లుగా మేము డైవర్ట్ చేసామని, అది కూడా ఉక్రెయిన్ కి సంబంధించిన ప్రాంతాలపై పడేటట్టుగా డైవర్ట్ చేసామని కాబట్టి ఆ విధంగా మేమే అప్పర్ హ్యాండ్ లో ఉన్నామని చెప్తుంది రష్యా.