బ్రిటన్ ప్రధాని మనోడైనా.. బంధం తెగిపోతోందా?

బ్రిటన్, భారతదేశం మధ్య కొంత విభేదాలు వచ్చాయి. దీనికి కారణం బ్రిటన్ లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఖలిస్తాన్  మద్దతుదారులు భారత జెండాను దించి వేసి, ఖలిస్థాన్  జెండాను ఎగురవేశారు. కనీసం భారత రాయబార కార్యాలయం వద్ద భద్రత కల్పించలేని పరిస్థితిలో బ్రిటన్ ఉండడం అనేది భారత తీవ్రంగా ఖండించింది. దీనికి సంబంధించి బ్రిటన్ తో వ్యాపార లావాదేవీలు తెంచేసుకునేందుకు భారత్  సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.


అయితే గతంలో బ్రిటన్ ప్రధానిగా బోరీస్ జాన్సన్ ఉన్నప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకుంది.తద్వారా చైనా, భారత్ లాంటి పెద్ద దేశాలతో ఎగుమతులు దిగుమతులు వ్యాపారాలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావించింది.


బ్రిటన్ లో ఖలిస్తాన్ మద్దతుదారులు తీవ్రమైన చర్యలకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ తో భారత్ వ్యాపార సంబంధాలు పెట్టుకోదని భావించారు. అయితే దీనిని భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వం కొట్టి పారేసింది. రిషి సునాక్  ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడినట్టు తెలుస్తుంది.


ప్రధాని అయిన తర్వాత ఎక్కడెక్కడ అయితే వ్యాపార వాణిజ్య ఒప్పందలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని పరిశీలిస్తూ భారత్ తో వ్యాపార  సంబంధాలు పెట్టుకోవడానికి బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ఉందని తెలుస్తోంది. బ్రిటన్ తో భారత్ తెగదెంపులు చేసుకున్నట్టు వస్తున్న వార్తలను ఇరుదేశాలు కొట్టి పారేశాయి. కాబట్టి రెండు దేశాల మధ్య మరింత వ్యాపారాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. భారత రాయబార కార్యాలయం పై ఖలిస్తాన్ జెండా ఎగరవేసిన ఉగ్రవాదులపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు. తద్వారా వారిపై చర్యలు తీసుకున్నట్టుగా బ్రిటన్ ప్రభుత్వం భారత్ కు తెలియజేసింది. ప్రస్తుతం బ్రిటన్, భారత్ ల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు మరింత మెరుగ్గా కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: