బ్రిటన్ ప్రధాని రిషిని అవమానించిన బైడెన్?

అమెరికా అధ్యక్షుడు బ్రిటన్ ప్రధానమంత్రి విషయంలో సరికొత్త వివాదంలో చిక్కుకున్నారని తెలుస్తుంది. ఓ వీడియోలో భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడు విస్మరించినట్లు కనిపిస్తోంది. బెల్‌ ఫాస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగినటువంటి కథనం అది. బ్రిటన్ ప్రధానిని దూరంగా నెట్టారు అనేటువంటి వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విపరీతంగా ట్రోల్ కి గురవుతున్నారు.


ఇటీవల నార్తన్ ఐలాండ్ పర్యటనకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యొక్క వైరల్ వీడియో లో, అక్కడ అతను భారతీయ సంతతి  అయినటువంటి బ్రిటన్ అధ్యక్షుడైన రిషి సనక్‌ను పట్టించుకోలేనట్టుగా కనిపిస్తుండడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయింది. ఆ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో ఒక తుఫాను లా దూసుకుపోతుంది ఇప్పుడు. ఆ వైరల్ వీడియోలో బైడెన్ బెల్ఫోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ప్రెసిడెంట్ కోసం వేచి ఉన్న బ్రిటన్ నాయకుడిని నెట్టడం కనిపిస్తుండడం తో ఆ వీడియో అంత వైరల్ అయిందని తెలుస్తుంది.


ఇక్కడ విషయం ఏమిటంటే తన దేశంలో గొడవలు జరుగుతున్నా బైడెన్ ను రిసీవ్ చేసుకోవడానికి నార్తన్ ఐలాండ్ కి వెళ్లారు రిషి సనక్. ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకుంటూ దండం పెడుతుంటే రిషి సనక్ ని పట్టించుకోకుండా మిగతా వాళ్లతో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. అసలు యూకే ప్రధానినే గుర్తు పెట్టుకోలేదు బైడెన్ అంటూ పెద్ద ఎత్తున ఒక వీడియో వైరల్ అవుతుంది.


అయితే అది పోస్ట్ చేసినటువంటి ఏ ఎఫ్ బి మాత్రం అదంతా అబద్ధం. రిషి సనక్ ని జో బైడెన్ బాగా రిసీవ్ చేసుకున్నారు. రిషి సనక్ ఇంకా బైడెన్, వీళ్ళిద్దరూ కూడా బాగా మాట్లాడుకున్నారు. అంతవరకు అదంతా కట్ చేసి, వెళ్లిపోయేటప్పుడు దృశ్యాన్ని మాత్రమే పదే పదే చూపిస్తున్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో చేసిన మార్ఫింగ్ వీడియో అని చెప్తుంది ఏ ఎఫ్ బి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: