అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?
తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక దీనికి భిన్నంగా ప్రవర్తిస్తారు అనుకుంటే వాళ్లు కూడా సేమ్ పద్ధతిలోనే ప్రవర్తించినటువంటి పరిస్థితి. అయితే సోషల్ మీడియా వాళ్ళ పైన కేసులు, అరెస్టులు లాంటివి చేశారు వాళ్ళు. కాకపోతే కోర్టు ద్వారా వాళ్ళకి ముందస్తు బెయిల్స్ రావడం వాళ్లకి ప్లస్ అయ్యింది. ఇక్కడ మాటల తూటాలు పేల్చుకునేటువంటి వాళ్ళిద్దరూ సమాధానం చెప్పాల్సిందేమిటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దేవినేని ఉమా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
గుడివాడలో కొడాలి నానికి అంకుశం 2 సినిమా చూపిస్తామని రామిరెడ్డిని కొట్టుకుంటూ వెళ్లినట్లు, కొడాలి నానిని కూడా కొట్టుకుంటూ తీసుకెళ్తామని అన్నారు. మీ అంతు తెలుస్తాం, ఒక్కొక్కరికి రుచి చూపిస్తామని కూడా ఆ మధ్యన అనడం జరిగింది. అంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే కొడతారు జైలులో పెడతారు, తెలుగు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లందరి పైనా దొంగ కేసులు పెడతారు, చివరికి ఏదైనా చేస్తారు ఇదే కదా వాళ్ళ మాటలకు అర్థం.
ఈ మాటల్లో తప్పు లేకపోతే రేపు అధికారంలోకి వస్తే, ఇలా చేస్తామని చెప్పడం తప్పు కాకపోతే, మరి ఇప్పుడు అదే పని అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తే అన్యాయం, అక్రమం ఎలా అవుతుందని కొంతమంది వాదన. మేము అధికారంలోకి వచ్చాక ఇలా కొడతాం అని చెప్తున్నారంటే దానికి పరోక్షంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అలా కొట్టాలని సంకేతం ఇస్తున్నారా అనేది మరి కొంత మంది ప్రశ్న.