వివేకా హంతకుడు.. దర్జాగా తిరిగేస్తున్నాడు?

వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరికి సీబీఐ బెయిల్ వచ్చింది. అప్రూవల్ గా మారిన వారికి శిక్ష కూడా తగ్గుతుంది. దస్తగిరి బెయిల్ పై వైఎస్ అవినాష్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పాటు వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా దస్తగిరి బెయిల్ పై పిటిషన్ వేశారు.  దీనిపై దస్తగిరి ప్రెస్ మీట్ పెట్టి మరి కోర్టులో జరుగుతున్న విషయాలపై మాట్లాడుతున్నారు.


లొంగిపోయే ముందు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లతో మాత్రమే వివరాలు చెప్పాడు. గతంలో దస్తగిరి మాట్లాడుతూ..వివేకానంద రెడ్డి తనను తీసేసి కొట్టి చంపి కాగితాలు తీసేసుకున్నామని చెప్పాడు. గొడ్డలితో నరికామని చెప్పింది కూడా దస్తగిరే. ఆ గొడ్డలిని ఎక్కడి నుంచి కొనుక్కొంచింది కూడా చెప్పింది అతనే.


అలాంటి దస్తగిరి ప్రస్తుతం నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాక్షసత్వం కలిగినది అని చెబుతున్నారు. కానీ హత్య జరిగింది తెలుగుదేశం హయాంలో అన్నది మరిచిపోతున్నాడు.  వివేకా డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి ప్రస్తుతం ఒక డ్రైవర్ ను పెట్టుకుని వాహనాన్ని తీసుకెళ్లేలా మారాడు. సొంత వెహికల్, సొంత ఆస్తులు వచ్చాయి. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం తెలియడం లేదు.


వివేకా హత్య కేసులో డబ్బులు వచ్చాయంటే వాటిని అల్రడీ సీబీఐ స్వాధీనం చేసేసుకుంది. మరి దస్తగిరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. కోట్ల రూపాయాల డబ్బులు ఎలా వస్తున్నాయి. రెగ్యూలర్ గా రెండు మూడు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఇప్పడు ఎదురవుతున్న ప్రశ్న.. ఆంధ్రప్రదేశ్ లో అందరూ వివేకా హత్య కేసు గురించి మాత్రమే మాట్లాడుకుంటుంటే కేవలం డ్రైవర్ గా చేసిన వ్యక్తి హత్యనంతరం ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద వెహికల్ లో తిరిగేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నించే వారు ప్రస్తుతం రాష్ట్రంలో కరవయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: