బాబోయ్‌..ఏపీలో మళ్లీ కరెంట్‌ కోతలు?

రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండకూడదని సీఎం జగన్ ముందుగానే అధికారులకు సూచించారు. కానీ కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి. ఈ కరెంట్ కోతలకు సంబంధించి ఎప్పుడు పోతుంది. ఎప్పుడు కరెంటు ఉండదనే వివరాలు అధికారులు ప్రకటించాలి. కానీ వేసవి వచ్చిందంటే చాలు ఇష్టమొచ్చిన సమయంలో మూడు నాలుగు గంటలు తీసేస్తున్నారు. మళ్లీ అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇలా ప్రతిసారి కరెంట్ కోతలతో విసుగు చెందాల్సిన పరిస్థితి ప్రజలది.


ముఖ్యంగా పరిశ్రమలకు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతోంది. సమయపాలన లేకపోవడం వల్ల చాలా పరిశ్రమల్లో ఉత్పత్తులకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. స్వయంగా సీఎం కరెంట్ కోతలు ఉండకడదని చెప్పినా పట్టించుకోకుండా ఇలా చేస్తున్నారు. దీనికి విద్యుత్ ఉత్పత్తి పెరిగిపోవడం ఒక కారణమైతే, ఎండాకాలంలో ఎక్కువ విద్యుత్ ను వినియోగించడం కూడా మరొక కారణం. అయితే కరెంట్ సప్లై విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడమే కోతలకు కారణమని తెలుస్తోంది.


కరెంట్ బిల్లులు బాదేస్తున్న సమయంలో కూడా ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. అయినా ఎందుకు కరెంట్ ను సక్రమంగా ఇవ్వలేకపోతున్నారని ప్రజలు ప్రభుత్వాన్ని ట్రాన్స్ కో అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇలా సోలార్ పవర్ విషయంలో కూడా నిర్లక్షంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సోలార్ పవర్ ఉత్పత్తి చేసుకుందామంటే దానికి అనుమతి ఇవ్వరు.


ఇచ్చిన దానికి సవాలక్ష కొర్రీలు పెడుతుంటారు. అసలు వచ్చే కాలంలో సోలార్ ఉత్పత్తి పెంచుదామనే ఆలోచన పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్ కు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీన్ని ఎలా తగ్గించి ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన చేయాలి. సోలార్ విద్యుత్  వాడకం అనేది తప్పకుండా చేయాల్సిన పని. సోలార్ ద్వారా వచ్చే విద్యుత్ ను సరిగా వాడుకుంటే చాలా వరకు కరెంట్ కోతలను అధిగమించవచ్చు. ఈ వైపు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందనేది ప్రజల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: