పెట్టుబడుల్లో.. గుజరాత్‌కు షాక్‌ ఇచ్చిన ఏపీ?

పెట్టుబడులను ఆకర్షించడంలో గుజరాత్ ని దాటింది ఆంధ్రప్రదేశ్. దేశంలో సర్వేల ప్రకారం.. 2022-23 లో అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించినట్లు ప్రాజెక్టు టుడే తెలిపింది.  మొత్తం 306 ప్రాజెక్టులను సంబంధించి రూ. 7.6 లక్షల కోట్లు పెట్టుబడులతో అగ్రస్థానంలో నిలిచింది.  గుజరాత్ ను అధిగమించి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిచినట్లు ప్రాజెక్టు తెలిపింది. అంతకు ముందు ఉన్న గుజరాత్ స్థానాన్ని దాటేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానానికి వెళ్లినట్లు పేర్కొంది. 2022- 23 లో టాప్ పది రాష్ట్రాల్లో 7376 ప్రాజెక్టులను సంబంధించి 32లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు తెలిపింది.


అయితే ఏపీ నుంచి 23 శాతం వరకు పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొన్నాయి. 57 భారీ ప్రాజెక్టులను ఏపీ కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇందులో ఏడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరో 18 హైడల్ ఆధారిత ప్రాజెక్టులు ఉన్నట్లు, గుజరాత్ కు నైపుణ్యాభివృద్ధి లాజిస్టిక్ కు అయితే డిమాండ్ ఎక్కువగా ఉంది. గుజరాత్ కు 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. కర్ణాటకలో కూడా రూ. 4లక్షల కోట్ల పెట్టుబడులతో మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ. 1.52 లక్షల కోట్లతో తొమ్మిదిస్థానంలో నిలిచినట్లు పేర్కొంది. అయితే ఇందులో ఎన్ని సంస్థలు తమ పెట్టుబడులను పెడతాయి.


ఎంత మందికి ఉపాధి దొరుకుతుందనే చూడాలి. పరిశ్రమల స్థాపనకు ఆయా రాష్ట్రాల్లో వివిధ రకాల అనుమతులు రావాల్సి ఉంటుంది. ఇలా ప్రతిదీ అనుమతి తీసుకుని చేయాలి. సులభతరంగా అనుమతి లభిస్తే ఆయా సంస్థలు తమ పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వస్తాయి. అదే సమయంలో కంపెనీ ప్రొడక్ట్ ల తయారీ, వాటి ఎగుమతి, రా మెటిరీయల్స్ దిగుమతి, ట్రాన్స్ పోర్టు, ఉద్యోగాల కల్పన, కంపెనీలకు కావాల్సిన స్థలం, ఇలా ప్రతిదీ అన్ని రకాల అనుకూలంగా ఉంటే ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి. యువతకు ఉపాధి కూడా దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: