కీలకంగా మారుతున్న వివేకా రెండో భార్య పాత్ర?

వైఎస్ వివేకా హత్య కేసు మరో మలుపు తిరిగింది. వివేకా రెండో భార్య రంగంలోకి దిగింది. ఆమె పేరు షమీన్. సీబీఐ అధికారి సుధా సింగ్ చేసిన దర్యాప్తులో షమీన్ చాలా సంచలన వివరాలు వెల్లడించారు. వివేకా రెండో భార్య అని షమీన్ చెప్పుకున్నారు. రెడ్డీస్ ల్యాబ్ లో వైఎస్ వివేకా ఉద్యోగం ఇప్పించారని అప్పటి నుంచి మా మధ్య అనుబంధం పెరిగిందని పేర్కొన్నారు.


అనంతరం వివేకాకు తన భార్యతో పడటం లేదని తనను పెళ్లి చేసుకున్నారని అనంతరం ఒక ఇల్లు కూడా కట్టించారని తెలిపింది. పెళ్లి కూడా ఖాజీ సమక్షంలో జరిగిందని ఒక కొడుకు కూడా జన్మించాడని చెప్పింది. అయితే పెళ్లి అనంతరం ముస్లిం సంప్రదాయాన్ని మార్చుకోనని చెబితే ఆయన ఒప్పుకున్నారని పేర్కొంది. అనంతరం విషయం వివేకా కూతురికి తెలియడంతో ఆయన కట్టించిన ఇంటి నుంచి తరిమేశారని వాపోయింది. కావాలంటే నా కొడుకు వివేకాకే పుట్టాడని తెలుసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు చేయించాలని కోరింది. నా కుమారుడికి వివేకా ఆస్తిలో వాటా కావాలని కోరింది. దీని కోసం ఇప్పుడు కోర్టులో షమీనా కేసు వేయడం సంచలనం కలిగిస్తోంది.


దీంతో వివేకా కుతూరు సునీత సీఎం జగన్ పై  గుస్స అవుతున్నట్లు తెలుస్తోంది. సునీతను అడ్డుకోవడానికి సీఎం జగన్ షమీనాను రంగంలోకి దించారనే ఆరోపణలు వస్తున్నాయి. నిన్నటి వరకు వైఎస్ వివేకా హత్య కేసులో వాడివేడీ వాదనలు కొనసాగాయి. అది కాస్త ఇప్పుడు ఆస్తి పంపకాల కేసుగా మారనుందా.


సునీత చెబితే వినడం లేదని జగనే ఈ కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇన్ని రోజులు షమీనా బయటకు రాకపోవడానికి కారణాలు ఏమిటి? భర్తను హత్య చేసిన కూడా ఒక్క మాట్లాడని షమీనా ఇప్పుడొచ్చి భర్త ఆస్తిలో వాటా కావాలని కోరడం వెనక ఏదో బలమైన కారణం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: