ఉక్రెయిన్ కోసం.. రష్యాతో భారత్ యుద్ధం?
అట్లానే మాకు మా పక్కన ఉన్న చైనాకి, చైనా మిత్రుడైన రష్యా కి మధ్యన శత్రుత్వం వచ్చింది. కాబట్టి మీరు మాకు సంఘీభావంగా ఉండండి. చైనా మీకు శత్రు దేశం కాబట్టి, అటు రష్యా మాకు శత్రుదేశం కాబట్టి అన్నట్టు అడుగుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే అది చెప్పేటువంటి రష్యా మనకు మిత్ర దేశం. ఆ విషయం ఆ దేశానికి తెలియదా అంటే తెలిసి మరీ స్టేట్మెంట్లు ఇస్తుంది అదే విచిత్రం. శిక్షార్హత లేకుండా తమ ఎజెండాను ముందుకు తీసుకురావడానికి ఇష్టపడే వారిని ఆపకపోవడం వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించాలని ఉక్రెయిన్ భారతదేశానికి సూచించింది.
ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి న్యూఢిల్లీలోని ఐక్వా లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నాయకత్వం వహించినటు వంటి, దారి తీసినటువంటి సంఘటనల ద్వారా కష్టతరమైన తమ పొరుగువారిని ఎలా డీల్ చేయాలో ఉదాహరణలుగా తెలుస్తాయని, ఉపయోగపడతాయని యెమిన్ జీ ప్రోవా అన్నారు.
ఉక్రెయిన్ ఇప్పుడు పక్కనున్నటువంటి దేశాలతో వచ్చే సమస్యలతో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుందో, అలాగే భారతదేశం కూడా ఫేస్ చేస్తుందని, భారతదేశం బాధ కూడా మాకు అర్థమవుతుందని చెప్తుంది ఆవిడ. ఆవిడ చాలా తెలివిగా, భారతదేశానికి రష్యా స్నేహితుడు అని తెలిసి మరీ, తన దేశానికి పెద్ద శత్రువు అయిన రష్యా మీదకి భారతదేశాన్ని ఉసి గొలుపుతుంది ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన డిప్యూటీ ఫారెన్ మినిస్టర్.