పాకిస్తాన్‌లో చైనా మంటలు.. భారత్ కుట్ర చేస్తోందా?
అయితే ఉన్నట్లుండి నాలుగు వాచీ టవర్లను ఎవరో పేల్చేశారు. రాకెట్ లాంటి ఆయుధాలతో ధ్వంసం చేశారు. పాకిస్థాన్ మాత్రం ఇది ఇండియా చేసిన పనేనని ఆరోపణలు చేస్తుంది. వీటిని పేల్చేయడం వెనక ఇండియా కుట్ర ఉందని ఆరోపిస్తుంది.
పాకిస్థాన్ లో అనేక అభివృద్ది పనులకు ఇప్పటికే కొన్ని వేల డాలర్ల అప్పు ఇచ్చింది డ్రాగన్ కంట్రీ. కానీ ఇప్పటికీ ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. దాని నుంచి ఎలా బయట పడాలో తెలియని పాక్ ఇలాంటి దాడులను చూపి భారత్ పై ఆరోపణలు చేసి చైనా నుంచి మరింత అప్పు పొందాలనే ప్రయత్నం చేస్తోంది. కానీ పాక్ లో ఉన్న జనానికి చైనా తమ దేశంలో ఆధిపత్యం చెలాయించడం ఇష్టం లేదు.
తాలిబాన్లకు ప్రస్తుతం పాకిస్థాన్ తో అస్సలు పడటం లేదు. తాలిబాన్లు, పాక్ సైన్యానికి అప్పుడప్పుడు దాడులు జరుగుతున్నాయి. ఖైబర్ పంక్తువాలో జరిగిన దాడి తెహ్రీక్ ఈ తాలిబాన్ అనే సంస్థ చేసినట్లుగా ఆ సంస్థ ప్రకటించుకుంది. దీని వల్ల పాక్ చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది. అయినా పాక్, చైనా రెండు కలిసి ప్రపంచ వ్యాప్తంగా భారత్ ను బదనం చేయాలని కంకణం కట్టుకున్నాయి. మరి ఈ ఆరోపణపై భారత్ ఎలా స్పందిస్తుంది. పాక్ చేసిన నిరాధారమైన ఆరోపణలు ఏ విధంగా తిప్పి కొడుతుందో చూడాలి.