ఈసారి కర్ణాటక ఫలితాలు డిసైడ్ చేసేది వాళ్లే?

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటు  ఎక్కువ ఉంది. ఎందుకంటే సిట్టింగ్ టిక్కెట్లు చాలామందికి తీసేయడం గురించి అక్కడ ఆ పరిస్థితి ఏర్పడింది. అలాగే  కాంగ్రెస్ లో కూడా తిరుగుబాటులు ఉన్నాయి. ఎందుకంటే సిద్దరామయ్య వర్గాన్ని శివకుమార్ వర్గం చెడ కొట్టడం, శివకుమార్ వర్గాన్ని సిద్దరామయ్య వర్గం చెడ కొట్టాలనుకోవడంతో వాళ్ల మధ్యన కూడా తిరుగుబాటులు మొదలయ్యాయి.


ఈ పరిస్థితులే ఆ రాష్ట్రంలోని ఏ పార్టీకైనా జయాపజయాలను నిర్ణయించే కొలమానాలుగా ఉన్నాయని తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీకి 25 చోట్ల తిరుగుబాటుదారులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ విషయంలో 20 చోట్ల తిరుగుబాటుదారులు ఉన్నారని, తర్వాత జెడిఎస్ విషయంలో ఇదే పరిస్థితి నెలకొందని, దానికి 18 చోట్ల తిరుగుబాటుదారులు ఉన్నారని తెలుస్తుంది.


వాస్తవంగా తిరుగుబాటుదారుల లెక్కలు చూసుకుంటే 2018 లో భారతీయ జనతా పార్టీకి 20 మంది తిరుగుబాటుదారులు ఉన్నారు. అందులో 8 మంది గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో 24 మంది తిరుగుబాటుదారులు తిరుగుబాటు చేస్తే 11 మంది గెలిచారు. అలాగే జెడిఎస్ లో కూడా ఈ తిరుగుబాటుదారులు పెద్ద సంఖ్యలో అంటే 34 మంది వరకు తిరుగుబాటు చేస్తే అందులో 6గురు వరకు గెలిచారు.


అలాగే 2013లో ఇలాంటి తిరుగుబాట్లు బిజెపిలో పదిమంది చేస్తే ముగ్గురు గెలిచారు. అలాగే కాంగ్రెస్ లో ఆరుగురు తిరుగుబాటు చేస్తే ఒక్కరు గెలిచారు. జెడిఎస్ లో 22 మంది పోటీ చేసి ఆరుగురు గెలిచారు. 2008లో బిజెపిలో 58 మంది తిరుగుబాటు చేసి 27 మంది గెలిచారు. అలాగే కాంగ్రెస్ లో  20 మంది తిరుగుబాటు చేసి ఏడుగురు గెలిచారు. జెడిఎస్ లో 21 మంది పోటీ చేసి ముగ్గురు గెలిచారు. ఓవరాల్ గా బిజెపి తిరుగుబాటుదారులు 2008లో 46 శాతం గెలిచారు, అలాగే 2013లో 30 శాతం మంది గెలిచారు, అలానే ఈ తిరుగుబాటు దారులు శాతం 2018 లో 38 శాతం వరకు ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: