అమెరికా, బ్రిటన్‌లోని ఎన్నారైలకు ఎంత కష్టం వచ్చిందో?

ప్రస్తుతం ఎన్ ఆర్ఐలుగా బతుకుతున్న ఎంతోమంది ఇక్కడ చాలా కష్టపడి చదివి విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించేవారు. దీంతో వారికి ఎక్కువ కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసి పంపించే వారు. అమెరికాలో బ్రిటన్ లో ఉద్యోగాలు అంటే వారిని ఎంతో కీర్తించే వారు. ఎందుకంటే అక్కడ డాలర్లలో సంపాదించే వారు. ఇక్కడైతే రూపాయిల్లో సంపాదన. కాబట్టి వారికి ఎంతో ప్రాధాన్యం దక్కేది. అదే విధంగా డబ్బులు  వచ్చేవి.  


ఎన్ ఆర్ఐలు గా పని చేసిన, చేస్తున్న ఎంతో మంది చాలా కష్టాలు పడి మంచి ఉద్యోగాల్లో సెటిలయ్యారు. ఇండియాలో భూములు కొనుక్కున్నారు. అంతా బాగే ఉంది ఇక ఢోకా లేదనుకున్న సమయంలో ప్రస్తుతం బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభం పెను దూమారమే రేపుతోంది.


పెద్ద పెద్ద హోదాల్లో పని చేసే భారతీయ ఉద్యోగులకు కంపెనీలు ఏమీ చెప్పకుండా ఉన్న పళంగా తీసేస్తున్నాయి. అదే హోదాలో తక్కువకు పని చేసే వారిని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది ఒక విధంగా చాలా ఇబ్బంది కరమైన విషయం. ఇన్నాళ్లు ఆయా కంపెనీల భవిష్యత్తు ప్రణాళికలో భాగమే.. కంపెనీల బాగోగులు దగ్గరుండి చూసుకున్న వారిని కూడా నిర్ధాక్షిణ్యంగా తీసేస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో జరుగుతూనే ఉంది.


ఇది సరైన విధానం కాదని తెలుస్తోంది. ముఖ్యంగా లక్ష్యం మేరకు తీసుకునే నిర్ణయాలు కాకుండా ఎలాగైన సరే ఇండియన్స్ ఉద్యోగాలు తీసేయాలన్నది వారి అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ దేశస్థులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు ఉంటే మిగతా వారిని తీసుకోవడం.. లేకపోతే సొంత దేశస్థులనే రిక్రూట్ చేసే ప్రణాళికలను యూకే ప్లాన్ చేస్తోంది. ఇది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఉద్యోగాలు పోయి లక్షలు పోసి చదివిన చదువు ఒక వైపు.. లక్షలు పెట్టి వచ్చి మరీ అక్కడ ఉద్యోగాలు కోల్పోవడం మరో వైపు. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nri

సంబంధిత వార్తలు: