
కాశ్మీర్‌లో భూములు కొంటే చంపేస్తారట?
కానీ రాజ్యాంగం మార్చుకుని, రాజ్యాంగ సవరణలు చేసుకుని భారతదేశంలో భాగమైన తర్వాత, ఇప్పుడు ఎవరైనా అక్కడి భూములను లేదా ఇళ్లను కొనుక్కోవచ్చు. అక్కడకు వెళ్లి ఐదేళ్లు పైబడిన వాళ్ళు ఎవరైనా అక్కడ కొనుక్కోవచ్చు. కానీ అలా ఇల్లు లేదా స్థలాలు కొనుక్కోడానికి డబ్బులు లేని వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం అక్కడ స్థలాలను కేటాయిస్తుంది. ఇది నిజంగా అక్కడ ఉన్న పేద ప్రజలకు చాలా అద్భుతమైన అవకాశం.
కానీ అలా ఇచ్చే స్థలాలను తీసుకుంటే చంపేస్తామని, స్థలాలు ఇస్తే మేము ఊరుకోమంటూ ఉగ్రవాద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళందరూ స్థానికేతరులు అన్న పాయింట్ చెప్తున్నారు. అక్కడ పుట్టి, అక్కడే పెరిగినా కూడా వాళ్లని స్థానికేతరులు గానే చూస్తారట. స్థానికేతరులకు స్ధలాలు ఇస్తే వాళ్లపై దాడులు చేసి వాళ్ళు ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఇప్పుడు అక్కడ ఇదే పెద్ద చర్చనీయాంశమైన విషయం అయ్యింది.
పీఎం ఆవాస్ యోజన పథకం కింద స్థానికేతరులకు ఫ్లాట్లు ఇస్తున్నారు. కాశ్మీర్ హౌసింగ్ బోర్డు అక్కడ ఇళ్ళను ఇస్తుంటే, వాళ్ళు స్థానికేతరులు వాళ్ళకి ఇల్లు ఎలా ఇస్తారు అంటూ తీవ్రవాదులు హెచ్చరిస్తున్నారు. జమ్మూ ఇంకా ఢిల్లీలో దాడులు చేస్తామని పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ వాళ్ళు హెచ్చరిస్తున్నారట.