జగన్.. కరెంట్‌ బిల్లు బాదుడు మామూలుగా లేదు?

జగన్ సర్కారు కరెంట్ ఛార్జీలతో సామాన్యులను బెంబెలెత్తిస్తోంది. విపరీతమైన బాదుడుతో కరెంట్ ఛార్జీలు కట్టాలంటేనే భయం వేసేలా చేస్తోంది. ఇది నిజంగా వెన్నుపోటేనని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు విద్యుత్ ఛార్జీల బిల్లు పేపర్ పట్టుకుని ఆఫీసుకు వెళితే అక్కడ అది కాదు.. వేరే బిల్లని చెప్పి గుండెలు గుబేల్ అనేలా చేస్తున్నారు.


వేరొక అమోంట్ అని చెబుతున్నారు. దాని పేరే ఏసీడీ అడిషనల్ క్యాష్ డిపాజిట్ అని అంటారు. ప్రతి ఒక్కరికి బిల్లులో ఏమీ ఉండటం లేదు. ఆన్ లైన్ చెల్లించాలన్నా కూడా ఏసీడీ పెడుతున్నారు. విద్యుత్ సంస్థలు ఎండాకాలంలో ఏసీడీని కొనుగోలు చేస్తున్నారు. విద్యుత్ సంస్థలు ఉత్పత్తిలో ఫెయిల్ అయితే  వారి  చేతకాని తనం వల్ల ప్రజలను పీక్కు తింటున్నారనే అభిప్రాయం నెలకొంది.


ఎంత ఘోరంగా ఉందంటే విద్యుత్ బిల్లు రూ. 1500 అయితే ఈ ఏసీడీ బిల్లు కూడా రూ. 1500 కట్టాలని అంటున్నారు. విద్యుత్ ఛార్జీలను రెండింతలు చేయడం అనేది దారుణమని ప్రజలు వాపోతున్నారు. కానీ ఈ ఎక్స్ ట్రా బిల్లు కట్టాలి. దానికి ఎలాంటి రిసిప్ట్ లు కూడా ఇవ్వడం లేదు. దీని వల్ల కోర్టుకు పోయినా ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే ఓన్లీ విద్యుత్ బిల్లుకు మాత్రమే రిసిప్ట్ చూపిస్తారు. దీనికి రెండింతలు ఫే చేయాలని చెబుతున్నారు. ఆన్ లైన్ లో కూడా ఇలాగే ఏసీడీ బిల్లు కడితేనే అసలు ఎమౌంట్ కట్టినట్లు చూపిస్తోంది.


ఇలా ప్రజాధనం దోచుకుంటున్న విధానంపై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు భావిస్తున్నారు. అర్థం పర్థం లేని నూతన విధానాలతో ప్రజల్ని హింసించే ఇలాంటి బిల్లులను ఎత్తేయాలని కోరుతున్నారు. విద్యుత్ అధికారులు మాకేమీ సంబంధం లేదు. మీరు ఎదైనా అడగాలంటే ప్రభుత్వాన్ని అడగాలని సూచిస్తున్నారు.  ఇలాంటి సూచనలు ప్రజల కష్టాల్ని తీర్చవని బాధపడుతున్నారు. దీనికి పరిష్కార మార్గం చూపాలని విద్యుత్ ఛార్జీలపై బాదుడు ఎత్తేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: