లోకేశ్ ఘన విజయం సాధించబోతున్నారా?
టీడీపీ సోషల్ ఇన్ ఛార్జి అయినా సతీశ్ చాగంటి మాట్లాడుతూ.. లోకేశ్ ఇంపాక్ట్ పని చేస్తుందని అన్నారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, జిల్లాలో రెండు, మూడు శాతం లోకేశ్ ఇంపాక్ట్ ఉంటుందని అనుకున్నాం. కానీ అది 5, 6 శాతం కంటే ఎక్కువగా లోకేశ్ ఇంపాక్ట్ ఉంటుందని దీని వల్ల చిత్తూరు, నెల్లూరు రెండు జిల్లాలే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ 2024 లో జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని చెబుతున్నారు.
తెలుగుదేశం సోషల్ మీడియా లో కొన్నేళ్లుగా పని చేస్తున్న ఈయన లోకేశ్ పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ఇది అని, దీని వల్ల పార్టీకి చాలా లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. జగన్ ను గద్దె దించడంలో లోకేశ్ ప్రధాన పాత్ర పోషించనున్నారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి లోకేశ్ ఇంపాక్ట్ ను వైసీపీ తట్టుకుని నిలబడగలదా..చంద్రబాబు ఒక వైపు, లోకేశ్ మరో వైపు. వైసీపీ వ్యతిరేక వర్గం ఇలా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి అనేక అనుకూల సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఇన్ని అవకాశాలను సృష్టించుకుని వచ్చే ఏడాదిలో పోరాటం చేస్తే టీడీపీ అధికారంలో కి రావడం ఖాయంగా కనిపిస్తోంది.