టార్గెట్‌ కేసీఆర్‌: రేంజ్‌ లేకున్నా.. ఘాటు తగ్గిని షర్మిల?

వైఎస్‌ షర్మిల.. తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. తన ప్రయత్నం తాను చేస్తున్నారు. అయితే.. ఆమె ఎంతగా ప్రయత్నించినా ఆ పార్టీకి పెద్దగా క్రేజ్ రావడం లేదు. వాస్తవానికి షర్మిల స్థాయిలో తెలంగాణలో ఏ నాయకుడూ ప్రయత్నించడం లేదంటే అతిశయోక్తి కాదేమో.. షర్మిల వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. నిరుద్యోగుల సమస్యతో పాటు అనేక సమస్యలను ఆమె ఫోకస్‌ చేశారు. ఎన్నో దీక్షలు చేశారు.


అయితే.. ఎంత చేసినా ఆ పార్టీకి పెద్దగా బజ్ రావడం లేదు. ఆ పార్టీలో చేరికలు కనిపించట్లేదు. అయితే షర్మిల మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. కేసీఆర్‌ ను షర్మిల విమర్శించినంతగా ఘాటుగా ఏ తెలంగాణ నేత కూడా విమర్శించడం లేదని చెప్పొచ్చు. ఇటీవల ఆమె పెట్టిన ఓ పోస్టు మరింత ఘాటుగా ఉండి  చర్చనీయాంశం అయ్యింది. తెలివిలేనోళ్లు కాంగ్రెసోళ్ళయితే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొన్న మీది అతి తెలివి కాదా చిన్న దొర అంటూ ఆమె కేటీఆర్‌ను టార్గెట్‌ చేశారు.


కాంగ్రెస్ నేతలు చేతకాని దద్దమ్మలు అయితే 2014 లో 6గురిని కొన్న మీరు పెద్ద దద్దమ్మలు కారా అని షర్మిల నిలదీశారు. చేతకాని సన్నాసులే అయితే 2018 లో 12మందిని కొన్నందుకు మీరు పెద్ద సన్నాసులు కారా అని షర్మిల ప్రశ్నించారు. ప్రతిపక్ష లీడర్లు ఎన్నికల సమయంలోనే కనిపించే సంక్రాంతి గంగిరెద్దులైతే ఎన్నికలకు 6 నెలల ముందు నిద్ర లేచిన కుంభకర్ణుడు కేసీఆర్ అని ఫైర్ అయ్యారు.


ఎందుకు మళ్ళీ కేసీఆర్ ను ఆశీర్వదించాలో ఒక్క కారణం చెప్పు చిన్న దొర అంటూ కేటీఆర్‌ను షర్మిల నిలదీశారు. రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.. రూ.5లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసినందుకు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలా అని షర్మిల ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరు చెప్పి మీ కుటుంబం లక్ష కోట్లు కాజేసినందుకు ఆశీర్వదించాలా అని షర్మిల ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి, 9 ఏళ్లలో 65 వేల ఉద్యోగాలే ఇచ్చినందుకు మళ్ళీ అధికారం ఇవ్వాలా అని షర్మిల అడిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: